/rtv/media/media_files/2026/02/13/zim-2026-02-13-15-03-25.jpg)
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే గ్రాండ్ విక్టరీ కొట్టింది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగాజరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే గెలవడం ఇది రెండోసారి కావడం విశేషం. 19 ఏళ్ల క్రితం జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను ఓడించిన జింబాబ్వే, ఇప్పుడు రెండోసారి అదే హిస్టరీని కొనసాగించింది. దీంతో ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జింబాబ్వే వంద శాతం రికార్డును సొంతం చేసుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ 64 పరుగులతో రాణించాడు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. జింబాబ్వే బౌలర్ల ధాటికి 146 పరుగులకే కుప్పకూలింది. బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచి జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు.
While associates like BAN AFG NED USA keep choking and getting public sympathy for decades, ZIM didn’t care for excuses (Raza injured) and upset Aus in T20 WC. If SL bt Aus and ZIM bt IRE, Aus will be out.#AusvZim#AusvsZim#ZimbabweCricket#T20WorldCup2026#icct20worldcup2026pic.twitter.com/IDGBHZusrx
— Pattu (@avijit_patnaik) February 13, 2026
బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయి
లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడబోయిన ఆస్ట్రేలియా బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. కేవలం 4.3 ఓవర్లలోనే 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన దశలో గ్లెన్ మాక్స్‌వెల్ (31), మాట్ రెన్ షా (65) కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే మాక్స్‌వెల్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరోసారి తడబడింది. చివరి 40 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయి 146 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.
జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. బ్రాడ్ ఎవాన్స్ కూడా 3 వికెట్లతో మెరిశాడు. ఈ విజయంతో జింబాబ్వే పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా, పటిష్టమైన ఆస్ట్రేలియాకు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది.
Follow Us