/rtv/media/media_files/2025/07/29/team-india-update-for-5th-test-2025-07-29-16-12-57.jpg)
IND Vs ENG 5th Test
భారత్ vs ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లతో ముందు వరుసలో ఉంది. ఇటీవల జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో.. ఇప్పుడు అందరి కళ్లు చివరి, 5వ టెస్ట్ పైనే ఉంది.
Also Read : "డ్రా ఆఫర్ డ్రామా"- బెన్ స్టోక్స్ & కో.. పై సునీల్ గవాస్కర్ ఫైర్..
IND Vs ENG 5th Test
ఈ చివరి టెస్ట్ మ్యాచ్ జూలై 31వ తేదీ నుండి లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ చూస్తుంటే.. మరోవైపు భారత్ కూడా ఈ చివరి మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని చూస్తోంది. అయితే అక్కడి వరకు ఓకే కానీ.. ఇప్పుడు టీమిండియా ఎన్నో ఇబ్బందులు పడుతోంది.
జట్టులో ఉన్న పలువురు ప్లేయర్లు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కాలి వేలికి గాయం కావడంతో అతడు 5వ టెస్ట్‌కు దూరం అయ్యాడు. ఇటీవల ఇదే విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. అంతకముందు స్టార్ పేసర్ ఆకాష్ దీప్, మిడిల్ ఆర్డర్ నితిశ్ కుమార్ రెడ్డి సైతం గాయాల కారణంతో జట్టు నుంచి బయటకెళ్లారు. ఇక బుమ్రా కూడా ఇప్పుడు అన్‌ఫిట్‌గానే ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.
🚨 TEAM INDIA UPDATE FOR 5TH TEST vs ENGLAND 🚨 [Sahil Malhotra from TOI]
— Johns. (@CricCrazyJohns) July 29, 2025
- Kuldeep Yadav is likely to play.
- Akash Deep is likely to return.
- Call on Bumrah will be taken in the next 24 hours. pic.twitter.com/HQlkU87P5J
ఈ నేపథ్యంలో తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చివరి, 5వ టెస్ట్‌లో టీమిండియా జట్టులోకి సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేరినట్లు తెలుస్తోంది. అతడితో పాటు గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆకాష్ దీప్ సైతం చివరి టెస్ట్‌లో తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ఇటీవల ప్రాక్టీస్ చేస్తున్నపుడు బాల్ తగిలి చేతికి గాయమై బెంచ్‌కే పరిమితం అయిన అర్ష్‌దీప్ సింగ్ కూడా ఓవల్ టెస్ట్‌లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని నివేదికలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చివరి ఆఖరి టెస్ట్‌లోకి బుమ్రా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు బలంగా టాక్ వినిపిస్తోంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : చెస్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌కు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలిస్తే షాకే?
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది. ఒకానొక సమయంలో టీమిండియా ఓడిపోతుందనుకునే టైంలో కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్ ఊపిరి పోశారు. మ్యాచ్‌ను సగం వరకు నడిపించి ఓడిపోకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మిగతా భారాన్ని తమ భుజాలపై వేసుకుని టీమిండియాను ఓటమి బారినుంచి తప్పించి డ్రాగా ముగించారు. ప్రస్తుతం భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది.
ind-vs-eng-test-match | IND VS ENG TEST SERIES 2025 | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | telugu-news