/rtv/media/media_files/2025/07/28/sunil-gavaskar-2025-07-28-19-27-12.jpg)
Sunil Gavaskar
Sunil Gavaskar: ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్(4th test ind vs eng) చివర్లో జరిగిన ఘటన అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా(ravindra jadeja), వాషింగ్టన్ సుందర్‌లు అద్భుతంగా ఆడి చెరో శతకాన్ని సాధించారు. అయితే ఈ శతకాలు సాధించిన టైంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల ప్రవర్తన మాత్రం పలు విమర్శలకు దారితీసింది.
మ్యాచ్ ముగింపుకు 15 ఓవర్లు మిగిలి ఉన్న వేళ, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(ben stokes) భారత జట్టుకు డ్రా ప్రతిపాదన చేశాడు. అయితే అప్పటికే జడేజా, సుందర్ ఇద్దరూ ఎనభై పరుగుల మార్క్ దాటి తమ శతకాల దగ్గర ఉండటంతో భారత జట్టు ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. జట్టుగా కాకుండా, ఆటగాళ్ల వ్యక్తిగత ఘనతకు విలువనిస్తూ, వారు శతకాలను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఐదో టెస్ట్‌కు పంత్ స్థానంలో అతడే - బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కుద్ది
సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) తీవ్ర అసంతృప్తి..
శతకాలు సాధించినప్పటికీ, ఇంగ్లాండ్ ఆటగాళ్లు వారిని అభినందించకపోవడం స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఎవరైనా ప్రత్యర్థి ఆటగాడు సెంచరీ కొడితే ప్రశంసించడం అనేది సహజం. కానీ ఇక్కడ అది కనిపించలేదు. దీనిపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ జట్టు ప్రవర్తనను ఉద్దేశించి ఇలా వ్యవహరించడం సరైనది కాదని విమర్శించాడు.
ఆటలో గెలుపు ఓటములు సహజం, కానీ ప్రత్యర్థిని గౌరవించడం అనేది చాలా ముఖ్యమైనది. డ్రా ఆఫర్‌ను తిరస్కరించినందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు వ్యంగ్యంగా వ్యవహరించడం క్రీడాస్ఫూర్తికి నష్టం కలిగించే లా ఉందంటూ గవాస్కర్ తెలిపారు.