Ind vs Eng: అన్న ఫామ్‌లోకి వచ్చిండు.. హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి!

ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అదరగొట్టేస్తున్నాడు. తాజాగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 బాల్స్‌కి 50 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు ఫామ్‌లో లేడన్న విమర్శకుల నోటికి చెక్ పెట్టాడు.

New Update
virat kohli 50 runs completed against england

virat kohli 50 runs completed against england

టీమిండియా (Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేవల ఫామ్ కొనసాగిస్తున్నాడు. గతంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నుంచి పెద్దగా ఆటతీరు కనబరచడం లేదు. ఇక ఇప్పుడు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి వన్డేకు దూరమయ్యాడు. మోకాలి నొప్పి కారణంగా మొదటి మ్యాచ్ ఆడలేకపోయాడు. 

Also Read: మహిళల్లో రొమ్ము కాన్సర్‌కు వేరుసెనగలు బాగా పని చేస్తాయా?

అయితే ఆ తర్వత రెండో వన్డే మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అదరగొడతాడని కటక్ స్టేడియంలో ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి. 8 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో చాలా మంది విరాట్‌ పేవల ఫామ్‌పై ట్రోలింగ్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విరాట్ రిటైర్మెంట్ ఇవ్వాలంటూ కామెంట్లు పెట్టారు. 

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

అద్భుతమైన ఆట ప్రదర్శన

ఇక ఇవాళ మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. తొలి వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, గిల్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ అద్భుతమైన ఆట ప్రదర్శన చేస్తున్నాడు. ఎడ్జ్ కటింగ్‌లతో ఫోర్లు కొడుతున్నాడు. రెండంకెల నెంబర్‌ను సాధించాడు. చాలా నెలల తర్వాత కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. 

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

కోహ్లి హాఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో ఆచి తూచి ఆడుతూ మొత్తంగా 50 పరుగులు పూర్తి చేశాడు. 50 బాల్స్‌లో 50 రన్స్ సాధించి ఔర అనిపించాడు. అయితే ఇప్పుడిప్పుడే బాగా ఆడుతున్నాడు అని అనుకునేలోపే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఏది ఏమైనా ఇలా ఇప్పటి వరకు పేవల ఫామ్ కనబరిచిన రోహిత్, కోహ్లి ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి రావడంతో క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు