ICC Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ సంచలనం.. కెరీర్‌లోనే ది బెస్ట్ ర్యాంకు

టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంచలనం సృష్టించాడు. టీ20లో 832 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తిలక్ వర్మ కెరీర్‌లో ఇదే బెస్ట్ ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్స్‌లో అతి పిన్న వయస్కుడైన టాప్ ప్లేయర్‌గా తిలక్ గుర్తింపు పొందాడు.

New Update
Tilak Varma

Tilak Varma Photograph: (Tilak Varma)

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సంచలనం సృష్టించాడు. టీ20లో 832 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తిలక్ వర్మ కెరీర్‌లో ఇదే బెస్ట్ ర్యాంకింగ్. అయితే ఈ ర్యాంకింగ్స్‌లో అతి పిన్న వయస్కుడైన టాప్ ప్లేయర్‌గా తిలక్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు బాబర్ అజామ్ పేరు మీద ఉండేది. 23 ఏళ్ల 105 రోజులో బాబర్ ఈ రికార్డును సృష్టించాడు. 

ఇది కూడా చూడండి:Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!

ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!

ఫస్ట్ ప్లేస్‌కి రావాలంటే..

రెండో స్థానంలో ఉన్న తిలక్ వర్మ ట్రావిస్ హెడ్‌‌ను దాటితే ఫస్ట్ ప్లేస్‌లోకి వస్తాడు. వీరి మధ్య 23 పాయింట్లు తేడా ఉంది. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో తిలక్ వర్మ రాణిస్తున్నాడు. వీటితో జరగనున్న మ్యాచ్‌లో తిలక్ పరుగులు చేస్తే మాత్రం తప్పకుండా ట్రావిస్ హెడ్‌ను దాటే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి:Maha Kumbh mela: వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

ఇదిలా ఉండగా.. తిలక్ వర్మ గతేడాది నవంబర్ నెలలో ర్యాంకింగ్స్‌లో 72వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ఏకంగా రెండో స్థానంలోకి వచ్చాడు. కేవలం మూడు నెలల్లోనే 70 స్థానాలు ఎగబాకి రెండో స్థానం సాధించాడు. 

ఇది కూడా చూడండి: USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి

Advertisment
తాజా కథనాలు