/rtv/media/media_files/2025/11/03/harmanpreet-kaur-net-worth-2025-11-03-16-25-58.jpg)
Harmanpreet Kaur Net Worth
భారత మహిళా క్రికెట్ జట్టు(team-india) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ఐసిసి ఉమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది. టీమ్ ఇండియాను ఛాంపియన్లుగా చేయడంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. రెండు సార్లు WPL టైటిళ్లను గెలుచుకున్న తర్వాత, హర్మన్‌ప్రీత్ ఇప్పుడు ICC టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్తులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆమె ఆస్తుల విలువ ఎంత?.. ఆమె ఒక్కో మ్యాచ్ ద్వారా ఎంత సంపాదిస్తుంది? అనే దాని గురించి ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : టీమిండియా జట్టులో నో ప్లేస్.. కానీ ఫైనల్ మ్యాచ్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్
Harmanpreet Kaur Net Worth
భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ముంబై నుండి పాటియాలా వరకు భారీగా ఆస్తులు ఉన్నాయి.
ఆమె అన్ని ఫార్మాట్లలో ఆడటంతో పాటు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం.. నికర విలువ 2024-25 నాటికి దాదాపు రూ.25 కోట్లు (సుమారు $250 మిలియన్లు)గా ఉంది.
ఆమె లీగ్ క్రికెట్‌తో పాటు విదేశీ లీగ్‌లో కూడా ఆడుతుంది. అక్కడ మరింత సంపాదిస్తుంది.
అది మాత్రమే కాకుండా హర్మన్‌ప్రీత్ కౌర్.. WPLలో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తుంది. దీని ద్వారా ఆమె రూ1.80 కోట్లు (సుమారు $18 మిలియన్లు) సంపాదిస్తుంది.
మరీ ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్.. పంజాబ్ పోలీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పదవిని కూడా కలిగి ఉంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా భారీ మొత్తాన్ని సంపాదిస్తుంది. సంవత్సరానికి దాదాపు 40 నుండి 50 లక్షల రూపాయలు సంపాదిస్తుంది.
ఆమె ఒక వాణిజ్య షూటింగ్ కోసం దాదాపు రూ.10-12 లక్షలు వసూలు చేస్తుంది.
అలాగే హర్మన్ HDFC లైఫ్, ITC, బూస్ట్, CEAT, PUMA, TATA Safari, Asian Paints, Jaipur Rugs, The Omaxe State వంటి బ్రాండ్‌లను కూడా ఎండార్స్ చేస్తుంది.
అంతేకాకుండా హర్మాన్ ముంబై నుండి పాటియాలా వరకు మరిన్ని ఆస్తులను కలిగి ఉన్నారు. ఆమె కుటుంబం ప్రస్తుతం పాటియాలాలోని ఒక విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తుంది.
ముంబైలో హర్మన్ వద్ద ఒక లగ్జరీ కారు, ఒక వింటేజ్ జీప్‌తో సహా అనేక కార్లు ఉన్నాయి.
అంతేకాకుండా ఆమె ఒక బైక్ ప్రియురాలు. ఆమెవద్ద హార్లే-డేవిడ్సన్ లాంటి ఖరీదైన బైక్ కూడా ఉంది.
Also Read : హ్యాట్సాఫ్ హర్మన్‌ప్రీత్.. గురుభక్తి చాటుకున్న భారత కెప్టెన్!
Follow Us