World Cup : హర్మన్‌ప్రీత్, అమన్‌జోత్‌కు పీసీఏ భారీ నగదు బహుమతి!

మహిళల ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన స్టార్ ప్లేయర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) భారీ నజరానా ప్రకటించింది.

New Update
pca

మహిళల ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025(ICC Women's World Cup 2025) లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టు(team-india)లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన స్టార్ ప్లేయర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(punjab cricket board) (PCA) భారీ నజరానా ప్రకటించింది.కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్,  ఆల్రౌండర్ అమన్‌జోత్ కౌర్  లకు ఒక్కొక్కరికి రూ.11 లక్షల చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నట్లు పీసీఏ ప్రకటించింది. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన మునిష్ బాలికికు రూ. 5 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నారు. ఈయన కూడా పంజాబ్‌లోని పాటియాలాకు చెందినవారే. భారత క్రికెట్‌కు వీరు చేసిన అద్భుతమైన సేవలకు గుర్తింపుగా త్వరలోనే ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని పీసీఏ నిర్ణయించింది. ఈ సందర్భంగా పీసీఏ అధ్యక్షుడు అమర్‌జిత్ సింగ్ మెహతా, జాయింట్ సెక్రటరీ (ఆపరేటింగ్) సిద్ధాంత్ శర్మ  ఆటగాళ్లను, కోచ్‌ను అభినందించారు. దేశం గర్వించదగ్గ ఈ విజయంలో పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిని సన్మానించడం పీసీఏకు గర్వకారణమని పేర్కొన్నారు.

Also Read :  అయ్యో ప్రతీక.. 305 పరుగులు చేసినా నో మెడల్..

రూ. 51 కోట్ల భారీ నగదు 

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. చారిత్రక విజయాన్ని సాధించిన ఉమెన్ ఇన్ బ్లూ జట్టుకు రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సందర్భంగా ఈ భారీ నజరానాను ప్రకటించారు. సీసీ విజేత జట్టుకు అందించే ప్రైజ్‌మనీ (సుమారు రూ. 39.78 కోట్లు) కంటే ఎక్కువ మొత్తాన్ని బీసీసీఐ ప్రకటించడం విశేషం. 

ఈ 51 కోట్ల రివార్డులో ఆటగాళ్లు, కోచింగ్, సహాయక సిబ్బంది అందరూ భాగస్వాములవుతారు.ఈ భారీ బహుమతిని ప్రకటించడం ద్వారా, పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన గౌరవం, వేతనం అందించాలనే బీసీసీఐ విధానానికి మరోసారి బలం చేకూరినట్లయింది. గతంలో పురుషుల టీ20 ప్రపంచకప్ విజేతలకు ఇచ్చిన ప్రోత్సాహకాలకు సమానంగా లేదా అంతకంటే మెరుగైన బహుమతిని ఇవ్వాలని బోర్డు భావించినట్లు తెలుస్తోంది. ఈ విజయం కేవలం ట్రోఫీ మాత్రమే కాదని, దేశంలోని తదుపరి తరం మహిళా క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుందని, దేశం మొత్తంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టీమ్ ఇండియా సాధించిన ఈ అద్భుత విజయం భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. 

Also Read :  Women World Cup: ప్రపంచ కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్‌ నెక్లెస్‌లు..

Advertisment
తాజా కథనాలు