Women's World Cup: అయ్యో ప్రతీక.. 305 పరుగులు చేసినా నో మెడల్..

వల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా అమ్మాయిల్లో ఒక్కొక్కరిది ఒక్కో కథ. గెలుపులో ప్రతీ ఒక్కరూ ఫుల్ ఎఫెర్ట్స్ పెట్టారు. దానికి తగ్గ ఫలితం అందరికీ వచ్చింది. ఒక్క ప్రతీకకు తప్ప. చివర్లో పతకం మిస్ అయిన ఈమె భారత అత్యధిక స్కోరర్ లో ఒకరు కావడం గమనార్హం.

New Update
prateeka

ప్రతీక రావల్...వరల్డ్ కప్ కు ఎన్నికయిన టీమ్ ఇండియా జట్టులో సభ్యురాలు. మొదటి నుంచి బాగా ఆడింది కూడా. మొత్తం అన్ని మ్యాచ్ లు కలిపి భారత్ తరుఫున రెండో అత్యధిక పరుగులు చేసింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 51.33 సగటుతో 308 పరుగులు చేసింది. కానీ ఇంత చేసినా ప్రతీకకు మాత్రం గెలిచిన తరువాత వచ్చే మెడల్ మాత్రం రాలేదు. జట్టు సంబరాల్లో పాలుపంచుకున్నా.. పూర్తి ఆనందం మాత్రం దక్కలేదు పాపం.

ప్రతీక ప్లేస్ లో షెఫాలీ..

భారత జట్టు సెమీస్ కు రావడంలో, కప్పు గెలవడంలో ప్రతీక ముఖ్యపాత్ర వహించింది. కానీ సెమీస్ ముందు గాయం కారణంగా జట్టుకు దూరం అయింది. పూర్తిగా జట్టులో నుంచి తీసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆమె స్థానంలో సెమీఫైనల్, ఫైనల్‌ కోసం షెఫాలి వర్మ జట్టులోకి వచ్చింది. రెండు మ్యాచ్ లను ఆమె ఆడింది. చివరి ఫైనల్స్ లో అత్యధిక పరుగులు కొట్టి గెలుపుకు కూడా కారణం అయింది.

15 మంది జట్టులో లేదు..

అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం చివరి రెండు మ్యాచ్ లకు 15మంది సభ్యులలో ప్రతీక రావల్ లేదు. 15 మందిలో ఉంటేనే చివర్లో విజేత పతకాలను ఇస్తారు. దీంతో ముందు అంతా ఆడినా చివర్లో టీమ్ లో లేకపోవడం వల్లన ప్రతీకకు మెడల్ అందుకోలేకపోయింది. రెండు మ్యాచ్ లే ఆడిన షెఫాలీకి మాత్రం పతకం దక్కింది. ప్రతీక కాలికి దెబ్బ తగిలినా, జట్టులో లేకపోయినా కూడా జట్టుతో పాటూ ఉంది. చివరి క్షణం వరకు జట్టుకు అండగా నిలిచింది. ఫైనల్‌ అనంతరం ప్రతీక.. వీల్‌చైర్లోకూర్చునే సహచర ప్లేయర్లతో కలిసి సంబరాల్లో పాల్గొంది.

Also Read: Air India Crash Survivor: నిత్యం నరకం అనుభవిస్తున్నా...ఎయిర్ ఇండియా ప్రయాదంలో బతికిన వ్యక్తి ఆవేదన

Advertisment
తాజా కథనాలు