/rtv/media/media_files/2025/05/02/UPOSEWIKvdO7tWxdlzIz.jpg)
ఇవాళ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది. నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ జట్టు ముందు 225 టార్గెట్ ఉంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు బ్యాటర్లు చెండాడేశారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు.
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
10 ఓవర్ల స్కోర్
బౌలర్లకు ఏ మాత్రం చిక్కకుండా బంతిని చితక్కొట్టారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ మంచి ఆరంభం అందించారు. వీరికి జోష్ బట్లర్ తోడవ్వడంతో స్కోర్ భారీగా పోయింది. ఇందులో భాగంగా మొదటి ఇన్నింగ్ చేసిన GT జట్టు 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ల నష్టానికి 120 స్కోర్ చేసింది.
Also read : 12 ఏళ్లుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో దొరికిన ఇంటి దొంగ!
ఎవరెన్ని కొట్టారంటే
జీటీ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 23 బంతుల్లో 48 పరుగులు, శుభ్‌మన్ గిల్ 38 బంతుల్లో 76 పరుగులు, జోష్ బట్లర్ 37 బంతుల్లో 64 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 21 పరుగులు, తివాటి 3 బంతుల్లో 6 పరుగులు, రషీద్ ఖాన్ డకౌట్, షారుఖ్ ఖాన్ 2 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కత్ చివరి ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. కమిన్స్, జీషాన్ అన్సారీ ఒక్కో వికెట్ సాధించారు.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
SRHకు డూ ఆర్ డై
కాగా ఇది సన్‌రైజర్స్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇందులో గెలిస్తే ముందుకు.. లేదంటే ఇంటికి వెళ్లిపోవలసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు మాత్రమే సాధించింది. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంపై కన్నేసింది.
Also Read: మానస సరోవరం యాత్రపై చైనా కీలక అప్‌డేట్
ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న గుజరాత్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ తేడాతో గెలిస్తే అగ్రస్థానానికి చేరే అవకాశముంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య నాలుగు పూర్తి మ్యాచ్‌లు జరిగాయి. అందులో హైదరాబాద్ ఒక్క మ్యాచ్‌లోనే గెలించింది. గుజరాత్ 3 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
IPL 2025 | telugu-news | latest-telugu-news | gt-vs-srh