/rtv/media/media_files/2025/04/19/pcItxCgiuewX8FZnKAO8.jpg)
GT vs DC IPL
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతుంది. 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజ్‌లో రూథర్ ఫోర్డ్ 8* బట్లర్ 42* ఉన్నారు.
Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
సెకండ్ ఇన్నింగ్స్‌లో
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. దీంతో ఈ 204 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ జట్టు దూకుడుగా ఆడుతుంది.
ఓపెనర్లుగా శుభమన్ గిల్, సాయి సుదర్శన్ క్రీజ్‌లోకి వచ్చి మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి ఓవర్‌లో 0 వికెట్ల నష్టానికి 8 పరుగులు వచ్చాయి. మంచి జోరుమిదున్న బ్యాటర్లు వరుసగా పరుగులు రాబట్టారు. కానీ ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ శుభమన్ గిల్ (7) ఔటయ్యాడు. ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో 1.4 బంతికి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ క్రీజ్‌లో కివచ్చాడు. దీంతో సాయి సుదర్శన్, బట్లర్ మెల్లి మెల్లిగా స్కోర్ రాబడుతున్నారు.
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
ఇలా 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 55 పరుగులు వచ్చాయి. పర్వాలేదనుకుంటున్న సమయంలో గుజరాత్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. సాయి సుదర్శన్ (36) ఔట్ అయ్యాడు. 74 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్‌దీప్ వేసిన 7.3 ఓవర్‌కు సాయి సుదర్శన్ ఔట్ అయ్యాడు. మొత్తంగా గుజరాత్ జట్టు 10 ఓవర్ల ఇన్నింగ్స్ పూర్తి చేసింది.
GT vs DC IPL 2025 | IPL 2025 | latest-telugu-news | telugu-news