/rtv/media/media_files/2025/01/31/9XqUnYPAt24sW9ikYgUG.jpg)
India Vs England Fourth T20
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలో టీమ్ ఇండియా విజృంభించేసింది. బ్యాటింగ్, బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కానీ మూడో మ్యాచ్ లో మాత్రం కెప్టెన్ సూర్య జట్టు మాత్రం చతికిలపడిపోయింది. వరుణ్ కుమార్ 5 వికెట్లు తీసి బౌలింగ్ తో అదరగొట్టినా...బ్యాటింగ్ లో విఫలమవడంతో మ్యాచ్ ఓడిపోయింది. మరోవైపు మొదటి మ్యాచ్ గెలిచి ఇంగ్లాండ్ టీమ్ ఉత్సాహంగా ఉంది. మొదటి రెండు ఓడిపోయి డీలా పడిపోయిన జట్టుకు మూడో దానితో మళ్ళీ బలం చేకూరింది. సీరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సీరీస్ మనకు దక్కాలంటే సూర్యసేన ఈరోజు మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. అలాగే ఇంగ్లాండ్ కూడా ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. సీరీస్ చేతిలో ఉండాలంటే ఇది తప్పక గెలవాలి.
Also Read: USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం
సమిష్టి రాణిస్తేనే విజయం..
టీ20 సీరీస్ లో మొదటి మ్యాచ్ లో అభిషేక్ వర్మ, రెండో దానిలో తిలక్ వర్మ బ్యాటింగ్ బాగా చేసి జట్టును ఆదుకున్నారు. వారిద్దరూ తప్ప ఇంకెవరూ గట్టిగా బ్యాటింగ్ చేయలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొత్తానికే ఫెయిల్ అయ్యాడు. మూడో మ్యాచ్ లో బ్యాటర్లు అందరూ సమిష్టిగా చేతులెత్తేశారు. ఇప్పుడు నాలుగో దానిలో కూడా ఇదే రిపీట్ అయితే కష్టమే. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ ఆడకపోతే జట్టు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. అలాగే సంజూ శాంసన్ కూడా ఆడాలి. ఈరోజు మ్యాచ్ లో ఇద్దరు లేదా ముగ్గురు బాగా బ్యాటింగ్ చేస్తేనే తప్ప గెలవలేము. ఇక బౌలింగ్ లో స్పిన్నర్లు బాగానే రాణిస్తున్నారు. ఏడాది తర్వాత వచ్చిన షమి పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రవి బిష్ణోయ్ అయితే పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో ఈరోజు మ్యాచ్ లో ఎవరెవరిని బరిలోకి దింపుతారు అన్నది ఆసక్తిగా మారింది.
Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు