/rtv/media/media_files/2025/07/30/ind-vs-pak-2025-07-30-14-53-39.jpg)
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈజ్‌మైట్రిప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా, పాకిస్థాన్ సెమీ ఫైనల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకున్నట్లుగా వెల్లడించింది. ఈజ్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌తో తమ కంపెనీకి ఏ రూపంలోనూ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం WCLతో 5 సంవత్సరాల స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఏ మ్యాచ్‌లోనూ తాము పాల్గొనబోమని వెల్లడించారు.
Also Read : WCL 2025: పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఢీ
వ్యాపారం కంటే దేశమే ముఖ్యం
టెర్రరిజం, క్రికెట్ కలిసి ఉండలేవని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి దాడి తరువాత పాక్ పాల్గొనే ఏ మ్యాచ్ ను తాము సపోర్ట్ చేయమని నిర్ణయించామని తెలిపారు. కొన్ని విషయాలు క్రీడల కంటే పెద్దది కాదన్నారు. వ్యాపారం కంటే తమకు దేశమే ముఖ్యమని అన్నారు. భారత ప్రజల సెంటిమెంట్‌కు తాము విలువ ఇస్తామని స్పష్టం చేశారు. అయితే భారత్ ఆడే ప్రతి మ్యాచ్ కు తాము మద్దతు ఇస్తామని ఈజ్‌మైట్రిప్ తెలిపింది. కాగా ఈజ్‌మైట్రిప్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ స్పాన్సర్‌లలో టాప్ లో ఉంది. ఈజ్‌మైట్రిప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారతలోని క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలైన దేశభక్తి ఇదేనని అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.
Official Statement from EaseMyTrip
— EaseMyTrip.com (@EaseMyTrip) July 19, 2025
Despite entering into a 5-year sponsorship agreement with the World Championship of Legends (WCL) two years ago, our stance has always been clear—EaseMyTrip will not be associated with or participate in any WCL match involving Pakistan
We…
లీగల్ మ్యాచ్ రద్దు
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో భాగంగా లీగ్ దశలో ఇండియా, పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయింది. భారత ఆటగాళ్లు, ముఖ్యంగా శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ వంటి ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రవాది దాడి తరువాత భారత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. WCL నిర్వాహకులు కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరించి, భారత ప్రజలకు, ఆటగాళ్లకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఇండియా, పాక్ జట్లు రెండూ సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
అభిమానుల్లో ఉత్కంఠ
2025 జూలై 31వ తేదీన మొదటి సెమీ-ఫైనల్‌లో ఈ జట్లు తలపడనున్నాయి. అయితే లీగ్ మ్యాచ్ మాదిరిగానే, ఈ సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో WCL నిర్వాహకులు భారత్-పాకిస్థాన్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను ఎలా నిర్వహిస్తారనే దానిపై అభిమానుల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే, టోర్నమెంట్ నిబంధనల ప్రకారం పాకిస్థాన్ నేరుగా ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ, రాజకీయ ఉద్రిక్తతలు, దేశభక్తి భావనలు క్రీడా ఈవెంట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పవచ్చు.
Also Read : ఐదో టెస్ట్.. టీమిండియాలోకి నలుగురు స్టార్ ప్లేయర్లు..!
india-pakistan-matches | ind-vs-pak | latest-telugu-news | telugu-news | telugu-sports-news | telugu-cricket-news