/rtv/media/media_files/2025/07/30/india-vs-pakistan-2025-07-30-10-24-02.jpg)
india vs pakistan
WCL 2025:
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(world championship of legends) 2025 టోర్నీలో భారత ఛాంపియన్స్ జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై(west indies vs india) 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు(wcl 2025 points table) అర్హత సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌తో విండీస్‌ను 144/9కి పరిమితం చేసి, 13.2 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. భారత్ జట్టు తరపున పియూష్ చావ్లా 3 వికెట్లు, బిన్నీ, వరుణ్ ఆరోన్ రెండేసి వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో బిన్నీ 21 బంతుల్లోనే అర్ధ శతకం, యువరాజ్, యూసఫ్ పఠాన్ కలిసి మ్యాచ్ ముగించారు. పఠాన్ చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు 7 బంతుల్లోనే 21 పరుగులు చేయడంతో గెలుపు జండా ఎగరేసాడు.
Also Read: ఐదో టెస్ట్.. టీమిండియాలోకి నలుగురు స్టార్ ప్లేయర్లు..!
ఇక మరోవైపు, పాకిస్తాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా జట్టు బలమైన ఆటగాళ్లతో ఉన్నా కేవలం 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బౌలింగ్‌లో జాన్ హాస్టింగ్స్ ఓవర్‌లో 12 వైడ్లు, ఓ నోబాల్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పాక్ జట్టు కేవలం 8 ఓవర్లలో మ్యాచ్ గెలవడం పట్ల అనేక అనుమానాలు వెలువడుతున్నాయి. అభిమానులలో చాలామంది దీన్ని ఫిక్సింగ్ మ్యాచ్‌గా చెప్పుకుంటున్నారు.
అయితే, టోర్నీ(WCL 2025) ఆరంభంలోనే పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత ఆటగాళ్లు పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా ఆడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పుడు మ్యాచ్ రద్దయ్యింది. ఇప్పుడు అదే పాక్‌తో భారత్ ఆడుతుందా? లేదా మళ్లీ దూరంగా ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతున్నాయి.
Also Read:"డ్రా ఆఫర్ డ్రామా"- బెన్ స్టోక్స్ & కో.. పై సునీల్ గవాస్కర్ ఫైర్..
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే - భారత ఛాంపియన్స్ జట్టు పాక్‌తో సెమీఫైనల్ ఆడుతుందా? లేదా మళ్లీ తప్పుకుంటుందా? ఇదే జరిగితే పాకిస్తాన్ నేరుగా ఫైనల్‌కి వెళ్లిపోతుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగాల్సి ఉంది. ఇది జరిగితే గ్రూప్ స్టేజ్‌లో ఆడకుండా, సెమీ ఫైనల్‌లో ఆడినందుకు విమర్శలు ఎదురవుతాయి.
జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇదే పరిస్థితి కొనసాగితే, టోర్నీ ఆర్గనైజర్లు సెమీఫైనల్ మ్యాచ్‌లను మార్చే అవకాశం ఉంది. అంటే భారత్‌ను దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియా జట్లలో ఏదొక జట్టుతో ఆడేలా ప్లాన్ మారుస్తారని అంచనా. ఎందుకంటే ఈ రెండు జట్లు రెండో సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
Also Read:చెస్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌కు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలిస్తే షాకే?
మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆసియా కప్ 2025లో కూడా భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అక్కడ కూడా రెండు జట్లు ఎదురెదురుగా తలపడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి భారత క్రికెట్ బోర్డు, జట్టు యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై ఉంది.
జూలై 31న సెమీఫైనల్ జరగాల్సి ఉన్నా, మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఈ క్లాసిక్ రైవల్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read: ఐదో టెస్ట్‌కు పంత్ స్థానంలో అతడే - బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కుద్ది