పెద్ద మెంటల్ నా కొడుకు.. యువీ శిష్యుడుపై నితీశ్ సంచలన పోస్ట్

వాంఖేడ్ వేదికగా జరిగిన ఐదో టీ20లో యూవీ శిష్యుడు అభిషేక్ శర్మ చెలరేగాడు. 54 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. క్రికెటర్ నితీశ్ అభిషేక్‌ను ప్రశంసిస్తూ.. మెంటల్ నా కొడుకు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Nitish post

Nitish post Photograph: (Nitish post)

ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 247 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మ 54 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

ఇది కూడా చూడండి: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!

నితీశ్ రెడ్డి ప్రశంసిస్తూ..

అలాగే ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా కూడా అభిషేక్ శర్మ నిలిచాడు. దీంతో అభిషేక్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. యువీ శిష్యుడు అనిపించుకున్నాడని, రెండో యువీ వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో క్రికెటర్ నితీశ్ రెడ్డి కూడా అభిషేక్ శర్మను ప్రశంసించాడు. తనదైన శైలిలో మెంటల్ నా కొడుకు అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో లీడ్‌లో ఉంది. మరి ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ ఇండియా లేదా ఇంగ్లాండ్ గెలుస్తుందో చూడాలి.  

ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!

ఇది కూడా చూడండి: Vasant Panchami : నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు