/rtv/media/media_files/2025/02/02/fLrflWfEc0PzxV2zADHB.jpg)
India vs England 5th T20I team india won by england P
భారత్ - ఇంగ్లండ్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చేతులెత్తేసింది. కేవలం 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా దాదాపు 150 పరుగులతో భారీ విజయం అందుకుంది.
అభిషేక్ ఊచకోత
Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ము దులిపేశాడు. ఇదేం బ్యాటింగ్ రా బాబు అంటూ కొందరు.. చూస్తే ఇలాంటి బ్యాంటింగే చూడాలటూ ఇంకొందరు తెగ గుసగుసలాడుకున్నారు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ రెండు రికార్డులు సృష్టించాడు. మొదటిది 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి అత్యంత వేగవంతమైన ఫిఫ్టీల లిస్ట్ లో చేరిపోయాడు. ఇందులో రెండో స్థానంలో నిలిచాడు. అలా చెలరేగి ఆడుతున్న అభిషేక్ మరికొన్ని బంతులను ఎదుర్కొని ఇంకో రికార్డు క్రియేట్ చేశాడు.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ సారి 37 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో ప్లేయర్ గా ఇక్కడ నిలిచాడు. మొదటి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతడు 35 బంతుల్లో వంద పూర్తి చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇలా అభిషేక్ తన బ్యాట్ తో బాల్ ను తుక్కు తుక్కు చేస్తున్నాడు.
కాగా ఈ సిరీస్ ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో గెలిచేసింది. అయితే ఈ చివరి మ్యాచ్ లో గెలిచి ఆ విజయంతో వన్డే సిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఇంగ్లండ్ జట్టు చూస్తోంది. మరోవైపు విజయంతో సిరీస్ పూర్తి చేయాలని టీమిండియా చూస్తోంది. చూడాలి మరి ఈ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ ఏ జట్టు గెలుస్తుందో.