IND vs PAK: పాక్‌ జట్టులో వివాదాల కలకలం.. ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలపై దుమారం!

ఛాంపియన్ ట్రోఫీలో పాక్ పేలవ ప్రదర్శన చేస్తోందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆదివారం జరిగే మ్యాచ్ లో భారత్ ఫేవరెట్‌ అని చెప్పాడు. పాక్ టీమ్ లో అంతర్గత విభేదాలున్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేశాడు. వారు మోడర్న్‌ డే క్రికెట్‌ ఆడటంలో ఫెయిల్ అవుతున్నారన్నాడు

New Update
pakistan

Champions Trophy Irfan Pathan sensational comments on Pakistan

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలైన పోరు ఆదివారం జరగనుంది. ఈ మెగా టోర్నీలో దాయాదులు ఇండియా వర్సెస్ పాక్ తలపడనున్నాయి. పాక్‌ మొదటి మ్యాచ్ లోనే కివీస్‌ చేతిలో ఘోర పరాభవం పాలవగా టీమ్‌ఇండియా మాత్రం బంగ్లాపై విజయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించింది. అయితే భారత్ తో జరిగే మ్యాచ్ పాకిస్థాన్ కు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ క్రమంలోనే పాక్ ఆటతీరుపై ఇప్పటికే మాజీలు మండిపడుతుండగా తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాక్‌ కంటే భారత్ ఈ మ్యాచ్‌ ఫేవరెట్‌ అన్నాడు. పాక్ టీమ్ లో అంతర్గత విభేదాలున్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేశాడు. 

మోడర్న్‌ డే క్రికెట్‌ లో ఫెయిల్..

'పాక్ ప్లేయర్ల ఆట అందరినీ కలవర పరుస్తోంది. మోడర్న్‌ డే క్రికెట్‌ ఆడటంలో ఫెయిల్ అవుతున్నారు. టీ20, వన్డే క్రికెట్‌లో వెనకబడుతున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది స్పష్టంగా అర్థమైందిజ. దీనిని బట్టి భారత్‌తో గెలుస్తారని చెప్పడం కష్టమే. ఇక భారత్-పాక్‌ మధ్య పోటీ అంటేనే ఒక ఎమోషనల్. ఇరుజట్లు ఎలా హ్యాండిల్‌ చేస్తాయో చూడాలి. ఇండియాలో మంచి ఆల్‌రౌండర్లు ఉన్నారు. శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నాడు. గాయం నుంచి కోలుకొని తొలి మ్యాచ్‌లోనే షమీ 5 వికెట్లు తీయడం అద్భుతం' అంటూ తన అభిప్రాయాలు బయటపెట్టాడు ఇర్ఫాన్.

ఇది కూడా చదవండి: TG Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గత కొంతకాలగా స్పిన్ బౌలింగ్ లో ఇబ్బందిపడుతున్న విరాట్ కు పలు కీలక సూచనలు చేశాడు. స్లో బంతులు, లెగ్గీలను అసౌకర్యంగా భావిస్తున్నాడని చెప్పాడు. లెగ్‌సైడ్ వచ్చే బంతులను ఆడేందుకు ప్లాన్ లేకపోవడంతో విఫలమవుతున్నాడన్నారు. స్ట్రైక్‌ను రొటేట్ చేయకపోవడంవల్లే మరింత ఒత్తిడికి గురువుతున్నాడన్నారు. 

ఇది కూడా చదవండి: Christopher Nolan 'The Odyssey': 'ది ఒడిస్సీ' ఫస్ట్ లుక్ అవుట్.. ఈసారి ఏం ప్లాన్ చేశావ్ నోలన్ మావా ..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు