/rtv/media/media_files/2025/02/22/JYmIjo4lco33GRrHnmwG.jpg)
Christopher Nolan The Odyssey First Look
Christopher Nolan 'The Odyssey': హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. 2023 జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఈ దర్శకుడు హోమర్ రాసిన గ్రీకు కవిత ఆధారంగా తన తదుపరి చిత్రం 'ది ఒడిస్సీ' ని రూపొందించబోతున్నాడు. ఈ మూవీ నుండి లేటెస్ట్ గా ఒక కొత్త అప్డేట్ విడుదలైంది. ఈ సినిమాలో కథానాయకుడు ఒడిస్సియస్‌గా మాట్ డామన్ ఫస్ట్ లుక్ విడుదలైంది.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ఫస్ట్ లుక్ లో మాట్ డామన్ యోధుడు లుక్‌లో కనిపిస్తున్నాడు. హెల్మెట్ ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ముఖంపై ఉన్న మచ్చ కనిపించేలాగా కెమెరా వైపు తిరిగి నుంచున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Matt Damon is Odysseus. A film by Christopher Nolan, #TheOdysseyMovie is in theaters July 17, 2026. pic.twitter.com/7a5YbfqVfG
— odysseymovie (@odysseymovie) February 17, 2025
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
ఒడిస్సీలో స్టార్ కాస్ట్ వీరే..!
ది ఒడిస్సీలో, మాట్ డామన్ టామ్ హాలండ్, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో, అన్నే హాత్వే, చార్లిజ్ థెరాన్, జాన్ బెర్న్తాల్, బెన్నీ సఫ్డీ లాంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు . సహాయక పాత్రలో హిమేష్ పటేల్, ఎలియట్ పేజ్, బిల్ ఇర్విన్ లాంటి యాక్టర్స్ కనిపించబోతున్నారు.
Also Read: Viral News: రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్ అయిన నవవధువు!
ది ఒడిస్సీ గురించి వివరాలు చాలా సీక్రెట్ గా ఉంచుతున్నాడు డైరెక్టర్ నోలన్. ఈ చిత్రం ట్రోజన్ యుద్ధం తర్వాత కింగ్ ఒడిస్సియస్ దశాబ్ద కాలం పాటు స్వదేశానికి తిరిగి వెళ్ళే ప్రయాణాన్ని చూపించే విధంగా ఉంటుంది అని సమాచారం.