Champions Trophy 2025: పాక్‌ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్

పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరంభ సమయంలో భారత జాతీయ గీతం ప్లే చేసి షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి. 

New Update
ind vs pak

ind vs pak Photograph: (ind vs pak)

Champions Trophy 2025: పాకిస్థాన్(Pakistan) వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ ఆ దేశం వెళ్లలేదు. దీంతో ఇండియా(India) ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా నిర్వహించేలా ఐసీసీ(ICC) నిర్ణయించింది. అయినప్పటికీ పాకిస్థాన్ గడ్డపై భారత జాతీయ గీతం ప్లే చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుండగా ఇలా ఎలా జరిగిందంటూ క్రికెట్ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. 

భారత్ ఆడకపోయినా జాతీయం గీతం ప్లే..

ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం గ్రూప్‌ బిలో ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ మొదలయ్యే ముందు ఆయా దేశాల జాతీయ గీతాలను ఆలపించేందుకు సిద్ధమయ్యారు. అయితే లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ ఆరంభంకానున్న టైంలో భారత జాతీయ గీతం 'జనగనమన'ను ప్లే చేశారు. మొదట ఇంగ్లండ్ జాతీయ గీతం ప్లే అయింది.

ఆ తర్వాత ఆస్ట్రేలియా జాతీయ గీతం ప్లే అవుతుందని అనుకున్నారు కానీ భారత జాతీయ గీతం ప్లే అయింది. 3 సెకన్ల తర్వాత తేరుకున్న నిర్వాహకులు దాన్ని తీసేసి ఆస్ట్రేలియా జాతీయ గీతం ప్లే చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. భారత్ ఆడకపోయినా జాతీయం గీతం ప్లే చేయడంతో స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున్న కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా ఈ మూమెంట్ గురించి భారతీయులు గొప్పగా చెప్పుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: IRCTC Tickets New Rules: రైల్వేశాఖ షాకింగ్‌ నిర్ణయం.. జనరల్‌ టికెట్‌ ప్రయాణికులకు ఇక చుక్కలే..?

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 రన్స్ చేసింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ (165; 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ శతకం చేశారు. జో రూట్ (68; 78 బంతుల్లో 4 ఫోర్లు)తో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో డ్వారిషూస్‌ 3, ఆడమ్ జంపా 2, లబుషేన్ 2, మ్యాక్స్‌వెల్ 1 వికెట్ తీశారు. 

ఇది కూడా చదవండి: SLBC: సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం.. SLBC ఘటనపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు