IRCTC Tickets New Rules: రైల్వేశాఖ షాకింగ్‌ నిర్ణయం.. జనరల్‌ టికెట్‌ ప్రయాణికులకు ఇక చుక్కలే..?

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనరల్ టికెట్లపై ట్రైన్ పేరు, నెంబరుతో ప్రింట్ చేయబోతున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రయాణికుడు ఏ ట్రైన్‌కి వెళ్లాలనుకుంటున్నాడో అదే ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఇతర ట్రైన్‌లో ట్రావెల్ చేయడం కుదరదు.

New Update
Indian Railways New General Ticket Rules Set to Affect Crores of Passengers

Indian Railways New General Ticket Rules Set to Affect Crores of Passengers


భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రతి రోజు వందల ట్రైన్లు ప్రయాణికులను సేఫ్‌గా తమ గమ్యస్థానానికి చేర్చుతున్నాయి. ఇలా ఇండియన్ రైల్వేస్ (Indian Railway) రోజుకు కొన్ని కోట్ల మంది ప్యాసింజర్లను తీసుకెళ్తోంది. 3rd ఏసీ, 2nd ఏసీ, 1st ఏసీ, ఏసీ కార్ చైర్, స్లీపర్, 2nd సిట్టింగ్ అంటూ ఎంతో మంది ట్రావెల్ చేస్తున్నారు. దీనికోసం ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. 

కానీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించడానికి అయితే ఎలాంటి రిజర్వేషన్ అవసరం లేదు. జనరల్ బోగీల్లో ఎక్కాలంటే నేరుగా స్టేషన్‌లో టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కొచ్చు. అంతేకాకుండా ఆ టికెట్‌తో మనం ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయినా.. ఆ రూట్‌లో వెళ్లే మరో ట్రైన్ ఎక్కేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అలాంటి వారికి రైల్వే శాఖ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Trump-Musk:మస్క్‌ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్‌ మార్చేసిన ట్రంప్‌!

ఈ మేరకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ప్యాసింజర్లకు గట్టి షాక్ తగలనుందనే చెప్పాలి. ఏంటా నిర్ణయం అనే విషయానికొస్తే.. ఇప్పటి వరకు జనరల్ టికెట్‌తో ఏ ట్రైన్‌లో అయినా జనరల్ బోగీలో ప్రయాణించే వీలుంది. కానీ ఇకనుంచి ఆ ఫెసిలిటీ ఉండబోదని తెలుస్తోంది. జనరల్ టికెట్ బుకింగ్‌కి సంబంధించి క్రైటీరియాను మార్చాలని రైల్వేశాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!

త్వరలో కొత్త రూల్

ఇకనుంచి జనరల్ టికెట్‌పై సంబంధిత ట్రైన్ పేరు, నెంబరు, ఇతర వివరాలు ఎంటర్ చేయనున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా దీనిని అమలు చేయాలని రైల్వేశాఖ చూస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల ఆ టికెట్ కేవలం ఆ ట్రైన్ వరకే ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. గతంలోలాగ ఒక ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ ఎక్కేందుకు వీలు పడదు. 

మరికొద్ది రోజుల్లో రాబోతున్న ఈ రూల్ ప్రకారం.. ప్రయాణికుడు తాను ప్రయాణించాలనుకుంటున్న జనరల్ బోగీ టికెట్ తీసుకుంటే.. దానిపై ఆ ట్రైన్ పేరు, నెంబరు ఉంటుంది. అందువల్ల ఆ టికెట్ కేవలం తాను ప్రయాణించాలనుకుంటున్న ట్రైన్‌కే పరిమితం అవుతుంది. వేరే ఇతర ట్రైన్‌లు ఎక్కడానికి వీలు పడదన్నమాట. 

3గంటలే గడువు

అయితే ఇది మాత్రమే కాదు జనరల్ టికెట్‌పై 3గంటలే గడువు ఉంటుందని మీరు ఎప్పుడైనా చూశారా? అవును రైల్వే స్టేషన్‌లోకి ఎంటరైన తర్వాత ఒకసారి జనరల్ టికెట్ కొంటే.. అది కేవలం 3 గంటల వరకే చెల్లుతుంది. ఒకవేళ టికెట్ కొన్నాక మూడు గంటల తర్వాత రైలు ఎక్కుతానంటే ఫైన్ కట్టాల్సిందే. ఈ టైంలోపు ట్రైన్ బోర్డింగ్ కాకపోతే ఇంకో టికెట్ తీసుకొని ట్రావెల్ చేయాల్సిందే. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు