National Anthem: జమ్మూకశ్మీర్లో ఇకనుంచి జనగణమన పాడాల్సిందే
జమ్మూకశ్మీర్లో ఇదివరకు ఉదయం పాఠశాలల్లో జాతీయ గీతం పాడాలనే రూల్ లేదు. దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేయాలని ఆదేశించింది.