/rtv/media/media_files/2025/02/04/WmKQwFivfqzqvyb1wNZ0.jpg)
Supreme Court
సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా ఆ రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయుల్ని వెంటనే పంపివేయకుండా నిర్బంధ కేంద్రాల్లో ఉంచడంపై మండిపడింది. వాళ్లని స్వస్థలాలకు పంపించేందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉన్న 63 మందిని రెండు వారాల్లోగా పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read: బీసీ జనాభా తగ్గలే.. పెరిగింది.. ఇదిగో ప్రూఫ్.. సభలో రేవంత్ సంచలనం!
'' అక్రమంగా ఎవరైనా దేశంలోకి వచ్చినట్లు తెలిస్తే వాళ్లని పంపించేందుకు చర్యలు తీసుకోవాలి. నిర్బంధంలో ఉన్న విదేశీయుల్ని వాళ్ల స్వస్థలాలకు పంపించమంటే వారి చిరుమామా తెలియని చెబుతూ.. పంపించేందుకు నిరాకరిస్తున్నారు. వాళ్లని నిర్బంధ కేంద్రాల్లో ఉంచి పోషించలేం కదా. వెంటనే వాళ్లను వారి సొంత దేశాలకు పంపించండి. ఇందుకోసం ముహూర్తం ఏదైనా చూస్తున్నారా ?'' సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎంతమంది నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారో వాళ్లని వారి దేశాలకు పంపిచారన్న రిపోర్టులు కూడా సమర్పించాలని ఆదేశించింది.
Also Read: మణిపూర్ అల్లర్ల వెనుక సీఎం బైరెన్ సింగ్ !.. సుప్రీంకోర్టు ఆదేశం
ఇదిలాఉండగా.. అస్సాంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు పెద్దఎత్తున పెరిగిపోయారు. దీంతో స్థానికుల్లో అభద్రతాభావం పెరుగుతోంది. తమ వనరులు ఇతర దేశస్థులు తీసుకుంటున్నారని.. తాము మైనార్టీలుగా మారిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అక్రమ వలసదారుల్లో కొందరు మాదక ద్రవ్యాల రవాణా కూడా చేస్తున్న ఘటనలు వెలుగు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్రమంగా అస్సాంలోకి ప్రవేశిస్తున్న వాళ్లపై తమ దేశాలకు పంపించాలని దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది. అక్రమంగా వచ్చిన వారిని 14 రోజుల్లోగా పంపించేయాలని సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వానికి ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: తెలంగాణ కులగణన సర్వేపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు