/rtv/media/media_files/2025/07/27/bumrah-will-retire-soon-2025-07-27-11-02-39.jpg)
Bumrah will retire soon
ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇంగ్లాండ్ రెండు గెలుపులతో ముందంజలో ఉండగా.. భారత్ ఒకే ఒక్క గెలుపుతో వెనకబడింది. ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
Bumrah Retire Soon
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదటిగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ముందు 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఉంచింది.
Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చెమటలు పట్టించారు. ఏ ఒక్క బౌలర్‌కు అవకాశం ఇవ్వకుండా భారీ స్కోర్ చేశారు. ఆఖరికి బుమ్ బుమ్ బుమ్రా సైతం చెమటోడ్చి 2 వికెట్లకు 112 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో అతడిని ఉద్దేశించి టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి ప్లేయర్ల తర్వాత రిటైరయ్యే మరో పెద్ద ఆటగాడు బుమ్రానే అని అభిప్రాయపడ్డాడు.
Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు
తన దేహంతో పోరాటంలో బుమ్రా ఓడిపోయినట్లు కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. 31 ఏళ్ల బుమ్రా ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో మూడు రోజున పూర్తిగా తేలిపోయాడని తెలిపాడు. ‘‘బుమ్రా రాబోయే టెస్ట్ మ్యాచ్‌లలో ఇక ఆడకపోవచ్చు. రిటైరైనా అవ్వొచ్చు’’ అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ ఇప్పటికే రిటైరయ్యారు. ఇప్పుడు బుమ్రా వంతు అనిపిస్తోందని తన మనసులోని మాట చెప్పాడు. బుమ్రాకు ఆటపైనా చాలా ప్రేమ ఉందని.. కానీ అతడి శరీరం మాత్రం దానికి సహకరించడం లేదని పేర్కొన్నారు.
Also Read:ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
mohammad-kaif | jasprit bumrah injury | jasprit-bumrah