/rtv/media/media_files/2025/05/20/6UtuFP4jy5xw2ZKYX4Us.jpg)
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లు, ఫైనల్ కోసం బీసీసీఐ కొత్త వేదికలను ప్రకటించింది. 2025 మే 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయంలో జరగాల్సిన ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్‌ను లక్నోకు షిప్ట్ చేసింది. బెంగళూరులో వర్షాల కారణంగానే బీసీసీఐ వేదికను మార్చింది. ఎలాగూ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ రికార్డ్ బాగా లేకపోవడం వేదికను మార్చడం కూడా ఆర్సీబీకి కలిసొచ్చే అంశంగానే చెప్పుకొవచ్చు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!
IPL 2025 Playoffs schedule announced by BCCI! 🏟️🏟️🏟️
— IF SPORTS (@IFSPORT_) May 20, 2025
New Chandigarh and Ahmedabad are the venues for the knockout matches. #Cricket #IPL2025 #InsideFieldSports #Stadium #BCCI pic.twitter.com/rwmWf01gFj
Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!
ఫైనల్ నరేంద్ర మోదీ స్టేడియంలో
అంతేకాకుండా ఐపీఎల్ ఫైనల్, క్వాలిఫైయర్ 2ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అలాగే క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు న్యూ చంఢీఘర్‌లో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 3న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో పైనల్ జరగాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ యద్ధం కారణంగా టోర్నమెంట్ ను వారం రోజుల పాటు నిలిపివేసినప్పటికీ షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్ అదిరింది! (ఫోటోలు)
కాగా, ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రెండు టీమ్స్‌లో ఒక జట్టు ఫ్లే ఆఫ్‌కు చేరే ఛాన్స్ ఉంది.