Delhi Bomb Blast:చెప్పి మరీ దెబ్బ కొట్టాం..ఢిల్లీ పేలుళ్ళపై పాకిస్తాన్ నేత షాకింగ్ కామెంట్స్

నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గరలో జరిగిన కారు బాంబు పేలుళ్ళపై  పీఓకే మాజీ ప్రధాని చౌధురి అన్వరుల్ హక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పాం..చేసి చూపించామని అన్నారు.

New Update
pakistan

Delhi Bomb Blast: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదుల(Pakistan Terrorists) పనేనని ఇప్పటికే కన్ఫార్మ్ అయింది. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ నేత చౌదురి అన్వరుల్ హక్ సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ పేలుళ్ళలో తమ పాత్ర ఉందని ఆయన నేరుగా ఒప్పుకున్నారు. బలూచిస్తాన్ లో భారత్ జోక్యం చేసుకుంటే ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు మిమ్మల్ని దెబ్బతీస్తామని నేను ముందే చెప్పాను. అల్లాహ్ కృపతో దానిని మా వీరులు నిజం చేశారంటూ పీవోకే అసెంబ్లీలో అన్వరుల్ హక్ అన్నారు. ఈ విషయాన్ని డైరెక్ట్ గా అసెంబ్లీలోనే వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. 

Also Read: ఎంతకు తెగించావ్ రా.. తల్లిని అడ్డు పెట్టుకుని హనీట్రాప్‌

అన్నింటికీ సిద్ధపడే..

దీనిపై పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ స్పందిచలేదు.అలాగని ఖండించలేదు కూడా. కానీ మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ మాతో యుద్ధం చేయడానికి రెడీగా ఉందని..తాము కూడా అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యలు చేశారు.  భారత్‌తో ‘పూర్తిస్థాయి యుద్ధం’ అవకాశాన్ని తోసిపుచ్చలేమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి అప్రమత్తతతో ఉన్నామని ప్రకటించారు. అవసరమైతే పొరుగు దేశానికి బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో నేర్పించడానికి తమ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఖవాజా నోరు పారేసుకున్నారు.

Also Read: పళ్లు తోముకోడానికి ఏ బ్రష్ అయితే మంచిది..? 

బలూచ్ తో తమకేం సంబంధం లేదు.. 

ఇంకోవైపు బలూచిస్థాన్‌లో వేర్పాటువాద ఉద్యమం వెనుక భారత్ ఉందని పాక్ పదేపదే చేస్తోన్న ఆరోపణలను న్యూఢిల్లీ తిప్పికొట్టింది. పాక్ సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాల నుంచి ప్రపంచ దృష్టి మళ్లించే ప్రయత్నమని  చెప్పింది. బలూచ్‌లో జరిగే హింసకు తమకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. 

Also Read: ఏపీకి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఇక డిల్లీ పేలుళ్ళ వెనుక పాక్ మద్దతు ున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. వైట్ కాలర్ టెర్రర్‌ మాడ్యూల్‌ను జైషే ఉగ్రవాద సంస్థతో నేరుగా సంబంధాలున్న జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన మతపెద్ద మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్ ప్రోద్భలంతో డాక్టర్లు ఉగ్రవాదులుగా మారినట్టు తెలసింది. ఈ కేసులో ఇప్పటి వరకూ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన పలువురు వైద్యులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరిలో లేడీ డాక్టర్ షహీన్ సయ్యద్.. జైషే మహిళా విభాగం భారత్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. అలాగే ఢిల్లీ పేలుళ్ళకు పాల్డిని ఉమర్ నబీ కూడా ఫరీదాబాద్‌లో అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుడని..అందకూ కలిసే ఈ పేలుళ్ళకు పథక రచన చేశారని చెప్పారు. ఉమర్ నబీ ఉగ్రవాదం, ఆత్మాహుతి దాడి గురించి మాట్లాడిన వీడియో కూడా బయటపడింది. 

Also Read: USA: ఎపిస్టీన్ ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం

Advertisment
తాజా కథనాలు