/rtv/media/media_files/2025/09/27/asia-cup-2025-ind-vs-pak-final-live-streaming-when-and-where-to-watch-2025-09-27-18-05-57.jpg)
asia cup 2025 ind vs pak final live streaming when and where to watch
క్రికెట్ ప్రియులు ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది. ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఫైనల్ జరగాలని.. దాన్ని ఉత్కంఠగా చూడాలని ఎంతో మంది క్రికెట్ ప్రియులు, అభిమానులు కోరుకున్నారు. వారు కోరుకున్నట్లుగానే భారత్, పాక్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. 2025 ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.
IND Vs PAK Final Match live
ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా.. భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి. అయితే ఈ ఆసియా కప్ 2025లో మాత్రం.. భారత్ VS పాకిస్తాన్ తలపడటం మూడోసారి అవుతుంది. గత మ్యాచ్‌లలో రెండు సార్లు టీం ఇండియా పాకిస్తాన్‌ను ఓడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగ్గా అందులో టీమిండియా విజయం సాధించింది. తరువాత సెప్టెంబర్ 21న జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ విజయం సాధించింది.
ఈ రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన భారత్ రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లోనూ పాక్‌పై హ్యాట్రిక్ విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా, ఆతృతుగా ఎదురుచూస్తున్నారు. IND vs PAK ఫైనల్ మ్యాచ్ రేపు 7 గంటలకు ప్రారంభం అవుతుంది. రాత్రి 7:30 గంటలకు టాస్ వేయనున్నారు. 8:00 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను చాలా మంది సోనీలివ్ నెట్‌వర్క్‌లో మాత్రమే వీక్షించారు. అది కూడా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు మాత్రమే ఈ టోర్నీ మ్యాచ్‌లను చూడగలిగారు. కానీ ఎక్కడా కూడా ఫ్రీగా వీక్షించలేకపోయారు. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్‌ను ఇప్పుడు ఫ్రీగా వీక్షించే ఛాన్స్ వచ్చింది.
ఎప్పటిలాగే సోనీ లివ్ యాప్‌లో ఇండియా, పాక్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీనికి సబ్‌స్క్రిప్షన్ ఉన్న సభ్యులు మ్యాచ్‌ను చూడొచ్చు. అలాగే ఫ్యాన్ కోడ్‌లో కూడా మ్యాచ్‌ను వీక్షించవచ్చు. కానీ మీరు IND vs PAK ఫైనల్ మ్యాచ్‌ను కేవలం DD స్పోర్ట్స్‌లో మాత్రమే పూర్తిగా ఉచితంగా వీక్షించగలరు. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌కు యూజర్ రీచ్ భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.