Shapoor Zadran : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షాపూర్ జద్రాన్

ఆఫ్ఘనిస్థాన్ పేసర్ షాపూర్ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు షాపూర్ జద్రాన్ వెల్లడించాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో ఈ ప్రముఖ లెఫ్ట్ ఆర్మర్ ప్రధాన పాత్ర పోషించాడనే చెప్పాలి.

New Update
shapoor zadran

shapoor zadran Photograph: (shapoor zadran)

ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) పేసర్ షాపూర్ జద్రాన్ (Shapoor Zadran) కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు షాపూర్ జద్రాన్ వెల్లడించాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో ఈ ప్రముఖ లెఫ్ట్ ఆర్మర్ ప్రధాన పాత్ర పోషించాడనే చెప్పాలి. 10 సంవత్సరాలకు పైగా క్రికెట్ లో కెరీర్‌ను కొనసాగించిన జద్రాన్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 

Also Read :  వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

"ప్రతి ఆటగాడికి చివరి రోజు వస్తుంది.  22 ఏళ్ల సేవ, త్యాగం, క్రికెట్‌పై ప్రేమ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ని అధికారికంగా ప్రకటిస్తున్నా.  ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి, ఎందుకంటే క్రికెట్ నాకు ఆట మాత్రమే కాదు; అది నా అభిరుచి, గుర్తింపు... చిన్నప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నాను. ఇప్పుడు నేను  వెనక్కి తిరిగి చూసుకుంటే, అంతర్జాతీయ వేదికపై నా దేశ జెండాను ఎగురవేయడంలో ఒక ప్రముఖ  పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నాను" అని షాపూర్ జద్రాన్  తన పోస్టులో రాసుకొచ్చాడు.  

Also Read :  పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాకు పారిపోయాడు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Afghanistan World Cup

Also Read :  అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు

ఆఫ్ఘనిస్థాన్  తరుపున షాపూర్ జద్రాన్ 44 వన్డేలు ఆడి 43 వికెట్లు తీశాడు. 36 టీ20మ్యాచ్ లు ఆడి 37 వికెట్లు పడగొట్టాడు. 2009లో నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్ లోకి జద్రాన్  ఎంట్రీ ఇచ్చాడు.  37 ఏళ్ల 2020లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు.   ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జద్రాన్ రిటైర్మెంట్ ప్రకటించడం బిగ్ షాకనే చెప్పాలి. 

Also Read :  USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు