/rtv/media/media_files/2025/01/31/gOwJFcysNrKU00SFvyr3.jpg)
supreme court of india
కోర్టు ధిక్కరణ కేసు ఎదురుకుంటున్న ఓ నిందితుడు తన పాస్‌పోర్ట్ కోర్టు కస్టడీలో ఉన్నప్పటికీ అమెరికాకు ఎలా పారిపోయాడనే దానిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పాస్‌పోర్ట్ లేకుండా అతను ఎలా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాడని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాకు పారిపోయిన ఆ వ్యక్తిపై విచారణ జరిపి వెంటనే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పాస్‌పోర్టు లేకుండానే అతను విదేశాలకు ఎలా వెళ్లగలిగాడు... అతని ఎవరు సహకరించారు. తనికి అనుమతి ఎలా లభించిందో వివరించాలని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్‌ను సుప్రీంకోర్టు కోరింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది. విడిపోయిన భర్తపై భార్య దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
దంపతులిద్దరూ ఫిబ్రవరి 8, 2006న వివాహం చేసుకున్నారు. ఆ తరువాత అమెరికాకు వెళ్లారు. అక్కడ వీరికి ఓపాప జన్మించింది. అయితే, వైవాహిక విభేదాల కారణంగా వీరిద్దరూ సెప్టెంబర్ 12, 2017లో అమెరికా కోర్టు ద్వారా విడాకులు పొందారు. ఇండియాలో అతని భార్య పలు కేసులు పెట్టగా ఇద్దరి మధ్య 2019లో న్యాయస్థానంలో రాజీ కుదిరింది. ఒప్పందం ప్రకారం వారి ఏకైక బిడ్డ సంరక్షణను తనకు అప్పగించకపోవడంతో భార్య కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. 2022 సెప్టెంబర్ 26, నవంబర్ 10 ఉత్తర్వులను అనుసరించి, వ్యక్తిని కోర్టుకు హాజరుకావలసిందిగా అదేశించింది. డిసెంబర్ 13న అతడు కోర్టు ముందు హాజరయ్యాడు. 2024 జనవరి 17న, అన్ని ప్రొసీడింగ్‌లకు హాజరు కావాలని కోర్టు అతన్ని ఆదేశించింది. అయితే విచారణలు జరిగిన జనవరి 22, 29 తేదీల్లో అతను హాజరు కాలేదు.