SRH Vs LSG: జరిమానా వేసినా బుద్ధి మారలే.. దిగ్వేశ్‌తో గొడవపై అభిషేక్‌ షాకింగ్ కామెంట్స్!

లఖ్‌నవూ బౌలర్ దిగ్వేశ్‌తో వాగ్వాదంపై SRH బ్యాటర్ అభిషేక్ శర్మ స్పందించాడు. 'గేమ్‌లో ఎమోషన్స్ కామన్. మ్యాచ్ తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు బాగానే ఉన్నాం. అంతా కూల్‌' అని చెప్పాడు. కానీ ఎన్ని ఫైన్లు వేసినా దిగ్వేశ్ బుద్ధిమారలేదని ఫ్యాన్స్ తిడుతున్నారు. 

New Update
lsg vs srh

lsg vs srh Photograph: (lsg vs srh)

SRH Vs LSG: లఖ్ నవూ బౌలర్ దిగ్వేశ్‌ రాఠితో జరిగిన వాగ్వాదంపై SRH బ్యాటర్ అభిషేక్ శర్మ స్పందించాడు. 'గేమ్‌లో ఎమోషన్స్ కామన్. మ్యాచ్ తర్వాత దిగ్వేశ్‌తో మాట్లాడా. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. అంతా కూల్‌' అని చెప్పాడు. కానీ ఇంతకముందు ఫైన్ వేసిన బుద్ధిమారలేదంటూ ఫ్యాన్స్ తిడుతున్నారు. 

Also Read :  ప్రిన్సిపల్‌పై లేడీ టీచర్ యాసిడ్ దాడి.. అలా చేశాడనే పగతో దారుణం!

Abhishek Sharma Comments On Digvesh Rathi Argument

Also Read :  కరువు అంచున పాక్..ఉగ్రవాదం కారణంగా తగ్గిన సాయం

సోమవారం హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్, లఖ్ నవూ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. అయితే మెరుపు షాట్లతో విరుచుకుపడిన అభిషేక్.. ఆరంభంలోనే లఖ్‌నవూకు మ్యాచ్‌ను దూరం చేశాడు. ఈ క్రమంలోనే అభిషేక్ ను 8వ ఓవర్లో ఔట్ చేసిన దిగ్వేశ్‌.. తనదైన శైలిలో నోట్‌బుక్‌ సంబరాలు చేసుకున్నాడు. పెవిలియన్‌ వెళ్తున్న అభిషేక్‌ అతడిని చూస్తూ ఏదో అన్నాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన దిగ్వేశ్‌.. అభిషేక్‌ వైపు దూసుకెళ్లి గొడవపడ్డాడు. అంపైర్‌ సర్ది చెప్పి అభిషేక్‌ను బయటకు పంపించగా ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

అయితే ఈ వివాదంపై మ్యాచ్ తర్వాత మాట్లాడిన అభిషేక్.. ‘మ్యాచ్ ముగిసిన తర్వాత దిగ్వేశ్‌తో మాట్లాడిన. మేం ఇప్పుడు కూల్‌ గానే ఉన్నాం. ఒకవేళ ముందు బ్యాటింగ్‌ చేసి ఉంటే మా ప్లాన్లు వేరే ఉండేది. టార్గెట్ పెద్దగా ఉంటే ఛేదన వ్యూహాత్మకంగానే ఉంటుంది. పవర్‌ప్లేలో ఎక్కువ రన్స్ చేయాలనుకున్నాం. అందుకే నేను దూకుడుగా ఆడినా' అని అభిషేక్ చెప్పాడు. 

Also Read :  రాజభవన్ లో దొంగతనం చేసింది అతనే.. పోలీసుల సంచలన ప్రకటన!

 IPL 2025 | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు