/rtv/media/media_files/2025/05/20/cJ13t3OMY3xCcr9mBivh.jpg)
Pakistan Falling in to drought
ఏ ఉగ్రవాదానికైతే మద్దతు ఇస్తూ ప్రపంచ దేశాలతో వైరం పెట్టుకుందో ఇప్పుడు అదే ఉగ్రవాదం పాకిస్తాన్ ను సర్వనాశనం చేస్తోంది. అసలే తిండి లేక మాడుతున్న దాయాది దేశం ఇప్పుడు మరింత దరిద్రంలోకి నెట్టబడింది. పహల్గాంలో దాడి, సింధు జలాల నిలిపివేత, భారత్ తో యుద్ధం తర్వాత ఇప్పటికే పేద దేశంగా ఉన్న పాకిస్తాన్ మరింత దిగజారింది. అక్కడ కరువు తాండవించే దుస్థితికి చేరుకుంటోంది.
Also Read : మనుషుల మూత్రంతో బీర్.. తాగితే స్వర్గమే!
ఆకలి కేకలు...
పాకిస్తాన్ పత్రికి డాన్ రిపోర్ట్ ప్రకారం...ఆహార భద్రత విషయంలో పాకిస్తాన్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆహార ద్రవ్యోల్బణం 2024 డిశెంబర్ నాటికి 0.3 తగ్గితే...ఇప్పుడు అది మరింత దిగజారింది. పేదరికం, నిరుద్యోగం ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. 2022లో పాక్ లో సంభవించిన వరదలు...ఆ దేశంపై తీరని గాయాన్ని మిగిల్చాయి. ఆ తరువాత ఇయర్స్ 2023, 24లో కూడా పరిస్థితి ఏం బాగుపడలేదు. దీని వలన పాకిస్తాన్ లోని గ్రామీణ ప్రాంతాలైన సింధ్, బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ల్లాంటి గ్రామీణ ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. ఇప్పుడు సింధు జలాలను ఆపేయడంతో ఇక్కడ నీటి మట్టం కూడా తగ్గిపోయింది. దీని కారణంగా వ్యవసాయం భారీగా దెబ్బతినే స్థాయికి చేరుకుంది.
Also Read: Vande Bharat: విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే
పోషకారాహార లోపం..
పాకిస్తాన్‌లో 11 మిలియన్ల మంది ప్రజలు IPC దశ 3 సంక్షోభంలో లేదా అంతకంటే దారుణంగా జీవిస్తున్నారు. అలాగే మరో 2.2 మిలియన్ల మంది ప్రజలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తక్కువ బరువుతో పెద్ద సంఖ్యలో పిల్లలు పుడుతున్నారు. ఇక్కడ ఇన్ఫెక్షన్లు లాంటివి కూడా చాలా పెరిగిపోయాయి. దీనంతటికీ కారణం సరైన పోషకారాహారం అందకపోవడమే అని తెలుస్తోంది. చాలా మందికి అసలు కడుపుకు నిండా తిండే దొరకని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తూ పరిస్థితిని మరింత పాతాళంలోకి నెట్టేస్తోంది. తాజా పరిణామాలు ఆ దేశాన్ని మరింత కష్టాల్లోకి తోసేశాయి. ఉగ్రవాదం కారణంగా ప్రపంచ సంస్థలు ఏవీ పాకిస్తాన్ కు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు కనుక పాకిస్తాన్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే చాలా ప్రమాదం అని డాన్ పత్రిక నివేదించింది.
today-latest-news-in-telugu | pakistan | terrorism | drought
Also Read: Gold rates: భలే గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు
Also Read : ఆర్మూరులో మరో గురుమూర్తి.. కన్నబిడ్డల ముందే భార్య గొంతుకోసి..!