/rtv/media/media_files/2025/04/29/a3vnnxlMQwUZf6I2mTbW.jpg)
Vaibha Surya Vamsi
అతి చిన్న వయసులో క్రికెట్ లోకి అడుగు పెట్టింది ఎవరు అంటే...ఇప్పటి వరకు ఠక్కున చెప్పే పేరు సచిన్ టెండూల్కర్. కానీ ఇక మీదట చెప్పే పేరు వైభవ్ సూర్య వంశీ. ఐపీఎల్ లో పుట్టుకొచ్చిన ఈ సంచలనం మ్యాచ్ మ్యాచ్ కు అందరినీ మెస్మ రైజ్ చేస్తున్నాడు. మొదటి మ్యాచ్ లో తక్కువ స్కోరు అయినా వావ అనిపించాడు. రెండో మ్యాచ్ లో అయితే నోటి మాట రాకుండా చేశాడు వైభవ్. ఉప్పెనలా బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. 35 బంతులంలో 101 కొట్టాడు. 11 సిక్స్ లు, ఏడు ఫోర్లతో విజృంభించేశాడు.
Also read: BREAKING: టెర్రరిస్ట్ తహవూర్ హుస్సేన్ రాణాకు NIA కస్టడీ పొడిగింపు
ఇంత చిన్న వయసులోనే అంత బాగా ఆడడం ఒక ఎత్తు అయితే నిన్నటి మ్యాచ్ లో వైభవ్ మరో రికార్డ్ కూడా కొల్లగొట్టేశాడు. ఐపీఎల్ లో అత్యంత వేగంగా శతకం కొట్టిన వారిలో రెండో ప్లేస్ సాధించాడు. కరీమ్ జనత్ వేసిన పదో ఓవర్‌లో 6,4,6,4,4,6తో విరుచుకుపడ్డ వైభవ్.. తర్వాతి ఓవర్‌లో 94 పరుగుల దగ్గర మరో సాక్స్ కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో గుజరాత్ ఇచ్చిన 210 పరుగుల టార్గెట్ దూదిపింజెలా ఎగిరిపోయింది. వైభవ్ పుణ్యమాని రాజస్థాన్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసింది.
Also read: Pakistan: నీతిలేని కుక్క టర్కీ.. ఇండియా సాయాన్ని మరిచి ఇప్పుడు పాక్‌కు ఆయుధాల సరఫరా
Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో
వైభవ్ రికార్డులు..
టీ20 క్రికెట్‌లో 50 పరుగులు, వంద పరుగులు చేసిన యంగెస్ట్ ప్లేయర్ ( వైభవ్ ప్రస్తుత వయసు 14 ఏళ్ల 32 రోజులు)
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ (35 బంతుల్లో)
ఈ మెగా టోర్నమెంట్‌లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ.. అంతకు ముందు క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.
ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు(11) కొట్టిన ఇండియన్. దీన్ని మురళీ విజయ్ తో కలిపి పంచుకున్నాడు.
ఐపీఎల్‌లో అతిపిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడు
today-latest-news-in-telugu | IPL 2025 | vaibhav-suryavanshi
ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన
Follow Us