BREAKING: టెర్రరిస్ట్ తహవూర్ హుస్సేన్ రాణాకు NIA కస్టడీ పొడిగింపు

ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడు తహపూర్ హూస్సేన్ రాణా కస్టడీని ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. NIA కస్టడీలో ఉన్న రాణాకు కోర్టు సోమవారం మరో 12రోజుల కస్డడీ విధించింది. 18రోజుల రిమాండ్ తర్వాత, మరో 12రోజుల కస్టడీకి పంపారు. NIA అభ్యర్థనతో కోర్టు కస్టడీ పొడిగించింది.

New Update
Tahawwur Rana 123

ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న తహపూర్ హూస్సేన్ రాణా కస్టడీని ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలో ఉన్న రాణాకు సోమవారం మరో 12 రోజుల కస్డడీ విధించింది కోర్టు. మొదట 18 రోజుల రిమాండ్ ముగిసిన తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం మరో 12 రోజుల కస్టడీ పెంచారు. NIA కోరక మేరకు కోర్టు కస్టడీ పొడిగింపు మంజూరు చేసింది. రాణాను గత నెలలో అమెరికా నుంచి భారత్‌కు రప్పించారు. ముంబై కాల్పుల్లో (26/11)లో ఆయన టెర్రరిస్టులకు సాయం అందించారని ఆరోపణలు ఉన్నాయి. ప్లాన్‌ ప్రకారం కాల్పులకు పాల్పడిన వారికి లాజిస్టిక్స్ సప్లై చేశారు.

ఈ కేసులో సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ ఎన్ఐఏ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెందిన న్యాయవాది పియూష్ సచ్‌దేవా రాణా తరపున వాదిస్తున్నారు. రాణా తన న్యాయవాదిని కలవడానికి కోర్టు అనుమతించింది. పోలీసులు సమక్షంలో ఆయన న్యాయవాదితో మాట్లాడాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆయనకు రెండోవ సారి కస్టడీకి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. పాక్‌తో భారత్ సంబంధాలు తెగిపోయిన వేళ రాణా అరెస్ట్ కీలకం కానుంది. పాకిస్తాన్‌కు చెందిన తహపూర్ హూస్సేన్ రాణా కెనడా వెళ్లి అక్కడి నుంచి భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్పొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థలో తేలింది.

(Tahapur Hussain Rana | NIA custody | delhi-high-court | Tahawwur Rana | mumbai-blasts | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు