Minister KTR: సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది

సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌.. అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన మెడికల్‌ కాలేజీని ప్రారంభించారు.

Minister KTR: 50 ఏళ్లలో చేయనివాళ్లు ఇప్పుడు చేస్తారా? నిర్ణయం ప్రజలదే అంటున్న కేటీఆర్..
New Update

KTR Medical College Inauguration In Siricilla: సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla) లో పర్యటించిన కేటీఆర్‌.. అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన మెడికల్‌ కాలేజీని ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) హయాంలో తెలంగాణ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో ముందుందన్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల తర్వాత సిరిసిల్ల అభివృద్ధిలో దూసుకుపోతున్న నగరంగా నిలిచిందన్నారు. గత పాలకులు రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కలేజీని సైతం తీసుకురాలేకపోయారని ఆయన గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా.. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. దీంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులు.. పై చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని, అక్కడ లక్షలు ఖర్చుపెట్టేవారన్నారు. కానీ సీఎం కేసీఆర్‌ వైద్య విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా.. పైసా ఖర్చు లేకుండా సొంత రాష్ట్రంలోనే వైద్య విద్యను అభ్యసించేలా చేశారన్నారు. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిగ్రీ కాలేజీ కూడా లేదన్న ఆయన.. ఇప్పుడు డిగ్రీ, పీజీ కలేజీలతో పాటు వైద్య కాలేజీ సైతం వచ్చిందన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్ల తయారీలో సైతం నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. సిరిసిల్లలోని మెడికల్‌ కాలేజీలో వందమందికిపైగా డాక్టర్లు అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు.కాగా తెలంగాణ అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని కేటీఆర్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వకున్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తుందన్నారు. అంతేకాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి వెల్లడించారు.

Also Read: విచారణకు హాజరు కావాల్సిందే-తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

#brs #ktr #pm-modi #students #bjp #cm-kcr #minister #inauguration #rajanna-sirisilla-district #higher-education #medical-college #medical-college-inauguration-in-siricilla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe