/rtv/media/media_files/2025/01/24/5H2ezS1JQjGWAhHSj1nC.jpg)
sai Dharam tej wedding
Sai Dharam Tej: సినీ ఇండస్ట్రీ హీరో హీరోయిన్స్ పై తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా నటీనటులు పెళ్లికి సంబంధించిన వార్తలు మరీ వైరలవుతుంటాయి. అయితే తాజాగా మరో హీరో పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెళ్ళికి తేజ్ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. మెగాస్టార్ జోక్యం చేసుకున్నారట. ఇద్దరూ ఇష్టపడ్డప్పుడు వద్దనడం ఎందుకు? అని చెల్లికి సరిచెప్పడంతో పెళ్ళికి ఒప్పుకున్నారని ఇన్ సైడ్ టాక్. వచ్చే వేసవిలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయి వివరాలు త్వరలోనే బయటపెట్టనున్నట్లు సమాచారం.
Also Read: Tollywood Divorce: భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!
గతంలోనూ పెళ్లి వార్తలు..
అయితే గతంలోనూ సాయి ధరమ్ తేజ్ కి పెళ్ళికి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించాయి. ఆమధ్య ఒకసారి 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలో కలిసి నటించిన రెజీనాతో రిలేషన్ లో ఉన్నాడని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు కేవలం పుకార్లేనని ఇద్దరూ కొట్టిపారేశారు. ఆ తర్వాత మళ్ళీ మెహరీన్ తో పెళ్లి వార్తలు రాగా.. వాటిలో కూడా నిజం లేదని తేల్చి చెప్పారు. మరి ఇప్పుడొచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది.
సాయి ధరమ్ తేజ్ 2014లో పిల్లా నువ్వు లేని జీవితంతో సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది ఆక్సిడెంట్ తర్వాత 'విరూపాక్ష' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ్ భారీ విజయాన్ని అందుకున్నాడు.
Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్
Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!