ప్రభాస్ లో ఉన్న వయెలెంట్ యాంగిల్ మొత్తాన్ని పిండి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సలార్ మూవీ. ప్రశాంతో నీల్ కేజీఎఫ్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైరెక్టర్ ప్రభాస్ తో మూవీ తీస్తున్నాడు అనేసరికి అంచనాలు ఆకాశాన్ని దాటాయి. దానికి తగ్గట్టే మూవీ టీమ్ రిలీజ్ చేసిన టీజర్ కూడా దుమ్ములేపింది. ప్రభాస్‌ను సరిగ్గా చూపించలేదు కానీ…అతని క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ తో టీజర్ మోత మోగింది. 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసింది. దీన్ని బట్టి అర్ధంచేసుకోవచ్చు సలార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.
పూర్తిగా చదవండి..movies: సలార్ రిలీజ్ డేట్ చెప్పేశారు…ఎక్స్ లో ట్రెండింగ్ లో సీజ్ఫైర్.
ప్రశాంత్ నీల్, ప్రభాస్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సలార్ మూవీ రిలీజ్ డేట్ ను ఎట్టకేలకు ఫిక్స్ చేసింది మూవీ టీమ్. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల అవుతుందని ఎక్స్ లో ప్రకటించింది. సీజ్ ఫైర్ అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
Translate this News: