PRABHAS AS SIVA:శివుడి రూపంలో ప్రభాస్...సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏఐ ఫోటోలు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తుండగా శివుడిగా ప్రభాస్, పార్వతిగా నయనతార నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఐ టెక్నాలజీతో శివుడిగా ప్రభాస్ ఫోటోలు డిజైన్ చేశారు అతని అభిమానులు. ఇప్పుడు అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

New Update
PRABHAS AS SIVA:శివుడి రూపంలో ప్రభాస్...సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏఐ ఫోటోలు

కన్నప్ప సినిమాలో యంగ్ రెబల్ స్టార్ నటిస్తాడని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు కానీ...పరోక్షంగా హింట్ అయితే ఇచ్చింది. దాంతో పాటూ ఇందులో నయనతార కూడా యాక్ట్ చేస్తోందనే సమాచరం కూడా బయటకు వచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెబుతున్న ఈ సినిమా కోసం 100 కోట్లను ఖర్చుపెడుతున్నారు. షూటింగ్ అంతా న్యూజిలాండ్‌లోనే జరగనుంది అని....దీని కోసం 7 కంటైనర్ల సెట్ ప్రాపర్టీస్ అక్కడ చేరుకున్నాయని చెబుతున్నారు. కన్నప్ప సినిమాకు స్టార్ ప్లస్‌లో మహాభారత్ సీరియల్ తీసిన ముఖేష్ సింగ్ దర్శకత్వం చేస్తున్నారు. ఇకపోతే శివుడిగా ప్రభాస్ నటిస్తాడు అన్న విషయం గురించి కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ టాక్.

PRABAHS AS SHIVA

కన్నప్ప సినిమాలో భక్తుడిగా అతని పాత్ర ఎంత ముఖ్యమో వివుడి పాత్ర కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ పాత్ర కోసం ప్రభాస్‌ను తీసుకున్నారని చెబుతున్నారు. ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ ఇప్పటికే రాముడిగా కనిపించాడు. సినిమా డిజాస్టర్ అయినా...రాముడిగా యంగ్ రెబల్ స్టార్ లుక్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ప్రభాస్ శివుడి గెటప్ చేస్తే వావ అనాల్సిందే. ఆదిదేవుని అవతారంలో టాలీవుడ్ హంక్ ఇంత బావుంటాడా అనిపించకమానదు ఆ ఫోటోలు చూస్తే. అందుకే ప్రభాస్ శివుడి ఫోటోలు సోషల్ మీడియాను ఇప్పుడు షేక్ చేస్తున్నాయి.

PRABAHS AS SHIVA

శివుని గెటప్‌లో ప్రబాస్ బావుండడంతో...నటన కూడా ఇరగదీస్తాడు అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు రెబల్ స్టార్ అభిమానులు. అలాగే నయనతార కూడా ఇంతకు ముందు రెండుసార్లు పౌరాణిక పాత్రల్లో కనిపించి అదరగొట్టింది. ఇప్పుడు పార్వతిగా కూడా ఆమె బావుంటుందని అంటున్నారు. ప్రభాస్, నయనతార జంట శివపార్వుతులగా చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవడని అతని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

also read:విశాల్ ఆరోపణతో సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం..ఏంటంటే.!!

చూసినోళ్ళకు చూసినంత…క్రికెట్ పండగ మొదలవుతోంది.

Advertisment
తాజా కథనాలు