World Cup 2023: క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న విశ్వసమరానికి భారత్ సిద్ధమైంది. క్రికెట్ సునామీలో ముంచేందుకు అన్ని టీమ్‌లూ రెడీ అయ్యాయి. మొదటిసారి ఒంటరిగా అతిధ్యమిస్తున్న భారత్ మెగాటోర్నీకి సర్వం సిద్ధం చేసింది. నేడు అహ్మదాబాద్ లో సమరానికి తెర లేవనుంది. 12 ఏళ్ళ తర్వాత క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఇండియా(India)లో జరుగుతోంది. అక్టోబరు 5వ తేదీ నుంచి నవంబరు 19వ తేదీ వరకూ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది మేటి జట్లు ఈ వరల్డ్ కప్ లో పాల్గొననున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ మ్యాచ్ లు మొత్తం ఇండియాలోనే జరగనున్నాయి. భారత్ ఆతిథ్యదేశంగా ఈ ప్రపంచ్ కప్ ను నిర్వహిస్తుంది. ఇది 13వ ప్రపంచకప్ (13th World Cup). నాలుగేళ్లకు ఒకసారి ఈ వరల్డ్ కప్ జరుగుతుంది. 2019లో వరల్డ్ కప్ జరిగింది.
పూర్తిగా చదవండి..world cup 2023:చూసినోళ్ళకు చూసినంత…క్రికెట్ పండగ మొదలవుతోంది.
వన్డే వరల్డ్ కప్ కు అంతా సిద్ధమయింది. ఈరోజే క్రికెట్ పండగకు మొదటిరోజు. భారత్‌లో జరిగే ప్రపంచ సమరం ముంగిట్లోకి వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ కు దాదాపు నెలన్నర రోజులు పండగే పండగ. పసందైన షాట్లు.. అదిరిపోయే సిక్స్ లు, బౌండరీ లైన్ దాటే బంతులు, అద్భుతమైన క్యాచ్ లు, క్లీన్ బౌల్డ్, డకౌట్ లు, సెంచరీలు...ఓహ్..ఇలా ఒకటేమిటి చూసినోళ్లకు చూసినంత, ఎంజాయ్ చేసేవాళ్ళకు కావల్సినంత సంబరం.
Translate this News: