Latest News In Telugu BREAKING: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం TG: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. వారిచేత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో హైకోర్టు విధించిన స్టేను సుప్రీం కోర్టు ఎత్తివేయడంతో వీరి ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. పదవులపై అధిష్టానంతో చర్చ TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నట్లు సమాచారం. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మోదీతో కీలక భేటీ! AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission : నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీ నేడు ప్రకటన! హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా నేడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: నేను విచారం వ్యక్తం చేస్తున్న: కేటీఆర్ TG: మహాలక్ష్మి పథకంపై మహిళలను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని అన్నారు. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధానికి పిలుపు.. మహిళల ఉచిత బస్ ప్రయాణం పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. మరోవైపు తెలంగాణ మహిళా కమిషన్ కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై సూమోటోగా స్వీకరించింది. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mamta Benarjee: వైద్యురాలి ఘటనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ.. ఏమన్నారంటే ? కోలకతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడ్డ ఆ నిందితుడిని ఉరి తీయాలన్నారు. దోషిని ఉరి తీస్తేనే ఇలాంటి నేరాలు చేయకుండా ప్రజల్లో భయం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఏ ఒక్క అమాయకుడిని శిక్షించరాదన్నారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సమస్యల స్వీకరణకు ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించిన దగ్గుబాటి పురందేశ్వరి.! విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల సమస్యల స్వీకరణ కోసం రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ ను ఆమె ప్రారంభించారు. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వక్ఫ్ చట్ట సవరణపై మంత్రి ఫరూఖ్ సంచలన వ్యాఖ్యలు.. వక్ఫ్ చట్ట సవరణపై ఏపీ మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్ స్పందించారు. మత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. మత పెద్దలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదని వ్యాఖ్యానించారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn