YS Jagan: జగన్ కు బిగ్ షాక్.. ఎంపీ అయోధ్య సంచలన వ్యాఖ్యలు!

వైసీపీలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అన్ని కరెక్ట్‌గా జరిగి ఉంటే తామే గెలిచే వాళ్లమన్నారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. విజయసాయి రెడ్డి లొంగిపోయే రకం కాదన్నారు.

New Update
YS Jagan Ayodya Rami Reddy

YS Jagan Ayodya Rami Reddy

తాను రాజకీయాలకు దూరం అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. ప్రకటించినట్లుగానే రాజ్యసభ చైర్మన్ కు కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే.. విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి అయోధ్య రామిరెడ్డి సైతం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై అయోధ్య రామిరెడ్డి తాజాగా రియాక్ట్ అయ్యారు. పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు.
ఇది కూడా చదవండి: AP Politics: చిరంజీవి Vs కిరణ్ కుమార్ రెడ్డి.. ఏపీలో బీజేపీ సంచలన వ్యూహం!

రాజకీయాల్లో ఒత్తిళ్లు సహజం..

రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉంటాయన్నారు. ఆ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడాలన్నారు. విజయసాయి వెళ్లిపోవడం ఆయన వ్యక్తిగతమన్నారు. రాజకీయాల్లో అప్‌ అండ్ డౌన్స్ ఉంటాయన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలపై కూడా పార్టీ మారాలని ఒత్తిడి ఉందన్నారు. ఇంతటితో ఆగకుండా వైసీపీపై సైతం సంచనల వ్యాఖ్యలు చేశారు అయోధ్య రామిరెడ్డి. తమ పార్టీలో అన్ని కరెక్ట్‌గా జరిగి ఉంటే తామే గెలిచే వాళ్లమన్నారు. పార్టీలో కొన్ని లోపాలున్నాయన్నారు. వాటిని సరిదిద్దుకుంటామన్నారు. విజయసాయి లొంగిపోయే రకం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
ఇది కూడా చదవండి: Vijaya Sai Reddy: చంద్రబాబు సర్కార్‌పై విజయసాయి ప్రశంసల వర్షం.. కారణం అదేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు