Local Bodi Elections : 128 మున్సిపాలిటీల్లో అమల్లోకి ప్రత్యేక పాలన

తెలంగాణ వ్యాప్తంగా 128 మున్సిపాలిటీల్లో పాలకమండళ్ల గడవు ముగిసింది. ఈనెల 26తో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల గడువు ముగిసింది. అయితే ఆయా మున్సిపాలిటీల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది.

New Update
Karimnagar Municipal Corporation

Karimnagar Municipal Corporation

Local Bodi Elections : తెలంగాణ వ్యాప్తంగా 128 మున్సిపాలిటీల్లో పాలకమండళ్ల గడవు ముగిసింది. ఈనెల 26తో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల గడువు ముగిసింది. అయితే ఆయా మున్సిపాలిటీల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్థిక సామాజిక సర్వే ఒక కొలిక్కిరాలేదు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం బీసీ రిజర్వేషన్‌ అమలు చేయాలని బీసీ సామాజిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ అమలు చేయాలనే ఉద్ధేశంతో పాటు అర్హులైన వారికి రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు సామాజిక సర్వే చేపట్టింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల పాలన ముగిసి ఏడాది కావస్తోంది. బీసీ రిజర్వేషన్‌ ఒక కొలిక్కి వస్తే గానీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు.

కాగా బీసీ రిజర్వేషన్‌ పై ఏర్పాటు చేసిన డెడికేషన్‌ కమిషన్‌ తన నివేదిక ఇచ్చిన తర్వాతే బీసీ రిజర్వేషన్‌ ఒక కొలిక్కి రానుంది.అయితే మొత్తం రిజర్వేషన్లు గరిష్టంగా 50 శాతం మించరాదన్న రాజ్యంగ నిబంధన కారణాంగా బీసీ రిజర్వేషన్‌ 42 శాతం అమలు చేయాలంటే రాజ్యంగ సవరణ చేయాల్సిందే. పార్లమెంట్‌లో రాజ్యంగ సవరణ చేసి, దాన్ని ఆమోదించి బిల్లుగా పాస్ చేయాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు సాధ్యం కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ ఇప్పుడున్న నిబంధన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్‌ అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని విస్మరించినట్లవుతుంది. ఒకవైపు పాలకమండళ్ల పదవి కాలం ముగియడం, గ్రామ పంచాయతీల పాలన ముగిసి ఏడాది గడవడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. అయితే పాలకమండళ్లు లేకుండా పాలన సాగిస్తే అభివృద్ధి కుంటుపడుతుందనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల పై ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

అమల్లోకి ప్రత్యేక పాలన 


ఈ నెల 26 తో రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీల్లో పాలక మండళ్ల గడువు ముగిసింది. దీంతో సోమవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది.  ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిశోర్‌ జీవో 15 విడుదల చేశారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని నస్పూర్‌, కొత్తపల్లి మంచిర్యాల మున్సిపాలిటీలు కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీనమవ్వడంతో 128 మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన అమల్లోకి వచ్చినట్లయింది.

మున్సిపాలిటీల్లో పాలక మండళ్ల గడువు ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఒకవైపు రిజర్వేషన్ల అమలు, మరోవైపు పథకాల అమలు తదితర అంశాల విషయమై ప్రభుత్వం ఒక స్పష్టతకు రాలేకపోతోంది. రిజర్వేషన్లు అమలు చేయకపోతే బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న భయం పాలకవర్గాల్లో ఉంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్‌ అమలు చేస్తామని  ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 139 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో 128 మున్సిపాలిటీల పాలన ముగిసింది. ఇక ఈ నెల 28 నుంచి కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కూడా ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది.  ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisment
తాజా కథనాలు