Latest News In Telugu Smita sabharwal: ఐడియా ఇవ్వండి లక్ష రూపాయలు గెలవండి.. ఐఏఎస్ కీలక ప్రకటన! ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరో సంచలన పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెంచడం కోసం ఇన్నోవేషన్ ఐడియా ఇచ్చి లక్ష రూపాయలు గెలుచుకోవాలని సూచించారు. ఐడియాను 2024 సెప్టెంబర్ 30 వరకు తమకు పంపించాలని తెలిపారు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ ను కలిసిన అభిషేక్ మను సింఘ్వీ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సింఘ్వీకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు. By Nikhil 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponnam Prabhakar: స్థానిక ఎన్నికలకు బ్రేక్.. మంత్రి పొన్నం సంచలన ప్రకటన! TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఈ రోజు జరిగిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పొన్నం మాట్లాడుతూ.. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. కులగణనపై తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Madhuri: దివ్వెల మాధురి మరో సంచలనం.. బాహ్య ప్రపంచానికి దురంగా వెళ్తున్నానంటూ వీడియో! దివ్వెల మాధురి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం కారణంగా 10 రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపింది. 'మీ అందరినీ బాగా మిస్ అవుతాను. మళ్లీ వచ్చాక అన్నీ వివరంగా మాట్లాడుతా' అంటూ వీడియో రిలీజ్ చేసింది. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: రుణమాఫీపై రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ TG: రుణమాఫీపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 100 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సింహాద్రి అప్పన్న స్వామికి హోంమంత్రి అనిత పూజలు సింహాద్రి అప్పన్న స్వామిని ఏపీ హోంమంత్రి అనిత ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. అధికారులు ఆలయ మర్యాదలతో హోం మంత్రికి స్వాగతం పలికారు. అర్చకులు తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. By Nikhil 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP- World Bank: ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్! ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన రూ.15వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈ నెల 27వరకు బ్యాంకు ప్రతినిధులు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ పరిచయం చేయనున్నారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పావని కుటుంబ సభ్యులకు పరామర్శ తండ్రి వెంకన్నపై ప్రత్యర్థులు దాడి చేస్తుండగా చూసి తట్టుకోలెక గుండె పోటుకు గురై చనిపోయిన చిన్నారి పావని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలోని వారి నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. By Nikhil 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn