Times now Delhi Exit Poll: ఆప్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్.. టైమ్స్ నౌ ఎగ్టిట్ పోల్ లెక్కలివే!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆప్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు టైమ్స్ నౌ సర్వే తెలిపింది. ఆప్ 27 నుంచి 34, బీజేపీ 37 నుంచి 43, కాంగ్రెస్ 2 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది.

New Update
delhi

Delhi assembly election Times now Delhi Exit Poll

Times now Delhi Exit Poll: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా ఓటింగ్ శాతం నమోదైంది. ఇక ఢిల్లీలో ఆప్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు టైమ్స్ నౌ సర్వే తెలిపింది. ఆప్ 27 నుంచి 34, బీజేపీ 37 నుంచి 43, కాంగ్రెస్ 2 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 

పీపుల్స్ పల్స్, కొడిమో: 

పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన సర్వేలో బీజేపీకి జైకొట్టనున్నారని వెల్లడైంది. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టబోతున్నట్లు ఈ సర్వే పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 51- 60, ఆమో ఆద్మీ పార్టీ 10-19, కాంగ్రెస్ , ఇతరులు ఒక్క సీటు కూడా గెలిచే అవ‌కాశం లేదని వెల్లడించింది. 

న్యూఢిల్లీలో అత్యల్పం..

ఇక నార్త్‌-ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్‌ నమోదైంది. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్‌,  రాహుల్ గాంధీ,  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు