Rammohan Naidu: TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

ప్రముఖ సింగర్ మంగ్లికి అరసవల్లి సూర్య నారాయణ స్వామి ప్రొటోకాల్ దర్శనం కల్పించడంపై టీడీపీ కేడర్ ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు పేరు ఎత్తడానికే నిరాకరించిన ఆమెను కేంద్ర మంత్రి రామ్మోహన్ వెంట పెట్టుకుని ఆలయంలోకి తీసుకెళ్లడంపై మండి పడుతున్నారు.

New Update
TDP Singer Mangli

TDP Singer Mangli

Rammohan Naidu: శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిపై టీడీపీ(TDP) శ్రేణులు భగ్గుమంటున్నాయి.  రథసప్తమి సందర్భంగా అరసవల్లి సూర్య నారాయణ స్వామివారిని మంగ్లి మంత్రితో కలిసి దర్శించుకున్నారు. దీంతో ఆమెకు ప్రొటోకాల్ దర్శనం ఎలా కల్పిస్తారంటూ టీడీపీ శ్రేణులు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలకు మంగ్లి సన్నిహితంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. వైసీపీ సానుభూతి పరురాలికి ప్రొటోకాల్ దర్శనం ఎలా ఇప్పిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్.. బైక్‌పై వెళ్తున్న వారి గొంతులు కోసి..!

https://x.com/RamMNK/status/1886778029558653364

మంగ్లికి దర్శనం.. మమ్ముల్ని అవమానించడమే..

మంగ్లి జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఛానల్ కి సలహాదారుగా పని చేస్తున్నాని.. మన జగనన్న పాట పాడి వైసీపీ కోసం ప్రచారం చేసిందని ఫైర్ అవుతున్నారు. అయితే.. చంద్రబాబు కోసం పాటలు పాడమని అడిగితే పాడనని చెప్పిందని గుర్తు చేస్తున్నారు. అసలు చంద్రబాబు పేరే నోటితో పలకను అన్న వ్యక్తికి ఇలా ప్రొటోకాల్ దర్శనం కల్పించడం కేడర్ ను అవమానించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

మంగ్లి చేసిన కామెంట్స్ మీరు మర్చిపోయినా.. కార్యకర్తలు మరచిపోలేదని.. ఇకముందు ఇటువంటివి జరగవని హామీ ఇవ్వాలని మరికొంత మంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి ఇంత వరకు రియాక్ట్ కాలేదు. 

Also Read: ప్రముఖ వ్యాపారవేత్త పింకీ రెడ్డి ఫోన్ హ్యాక్! రిప్లై ఇవ్వదంటూ పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు