BIG BREAKING: పోసానికి బెయిల్
కడప కోర్టులో పోసాని కృష్టమురళికి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.
కడప కోర్టులో పోసాని కృష్టమురళికి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మళ్లీ మర్చిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ అంటూ ప్రెస్ మీట్లో మాట్లాడారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ సీఎం శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు అంటూ ప్రసంగించారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సతీమణి తండ్రి ఆంగోతు రాములు నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అద్దంకి రాములు నాయక్ కు నివాళులు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు.
తీవ్ర జ్వరంతో అసెంబ్లీకి వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడికి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే సభకు వస్తే సభ నుండి సస్పెండ్ చేసి పంపిస్తాం అంటూ నవ్వుతూ చెప్పారు. రెస్ట్ తీసుకోకోకుంటే.. యాపిల్ వాచ్ కొనిచ్చి మీ హెల్త్ ను మానిటర్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన బీఆర్ఎస్ కు దగ్గర అవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కాట శ్రీనివాస్ తో విభేదాలతో పాటు అనర్హత వేటే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
బీజేపీ ఎంపీ తేజశ్వీ సూర్య వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటిక్ సింగర్ శివశ్రీ స్కందప్రసాద్ను పెళ్లి చేసుకున్నారు. బుధవారం బెంగళూరులో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది.పెళ్ళికి సంబంధించిన ఫొటోలను ఎంపీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ఆర్ఎస్ఎస్ నేత సురేష్ భయ్యాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. భయ్యాజీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబైని లాక్కునేందుకు గుజరాతీలు కుట్ర చేస్తున్నారని ఠాక్రే ఆరోపించారు.
కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ గతంలో పోస్ట్ చేసిన ఓ కేకు ఫొటో మరోసారి చర్చనీయాంశమైంది. నెటిజన్లు రీ పోస్ట్ చేస్తున్నారు. 'ఈ కేక్ ఆకలి తీర్చుకోవడానికి సరిపోతుంది. కానీ టేస్ట్ చూడాలంటే రోహిత్ శర్మ కంటే చాలా ఫిట్‌గా ఉండాలి' అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.