Nagababu Original Name: నాగబాబు అసలు పేరు ఇదే.. 40 ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్.. అంతా షాక్!

నాగబాబు అసలు పేరు నాగేంద్రరావు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఆ పేరు చూసి అంతా షాక్ అవుతున్నారు. నాగబాబు అసలు పేరు ఇప్పుడు బయటకు వచ్చిందని చర్చించుకున్నారు.

New Update
Nagababu Original Name

Nagababu Original Name

కొణిదెల నాగబాబు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. మెగా బ్రదర్ గా, నటుడిగా, నిర్మాతగా, జబర్దస్త్ లాంటి టాప్ షోకు న్యాయ నిర్ణేతగా, ఇప్పుడు పొలిటీషియన్ గా ఆయన ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగిన నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన చట్టసభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే.. నాగబాబు అసలు పేరుపై ఇప్పుడు ఇంటర్ నెట్లో జోరుగా చర్చ సాగుతోంది. నాగబాబు/నాగేంద్రబాబుగా ఆయన తెలుగు ప్రజలకు ఇప్పటివరకు సుపరిచితుడు.

సర్టిఫికేట్లలోనూ అదే పేరు..

అయితే.. నిన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత విడుదలైన అధికారిక ప్రకటనలో నాగేంద్రరావు అని ఉండడం చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై ఆరా తీయగా నాగబాబు అసలు పేరు నాగేంద్రరావు అని తెలుస్తోంది. సర్టిఫికేట్లలోనూ నాగేంద్రరావు అనే ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఇంట్లో ముద్దుగా నాగబాబు అని అంతా పిలవడంతో వాడుకలోనూ అదే ప్రచారంలోకి వచ్చినట్లు వారు వెల్లడిస్తున్నారు.

అయితే ప్రొడ్యూసర్ గా ఉన్న సమయంలోనూ నాగబాబు అనే పేరునే ఆయన టైటిల్స్ లో వేసుకున్నారు. దీంతో నాగేంద్రరావు అనే పేరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులకు తప్పా ఎవరికీ తెలియకుండా పోయింది. ఎన్నికల నేపథ్యంలో విడుదలైన అధికార ప్రకటన ద్వారా ఆయన అసలు పేరు నాగేంద్రరావు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆయన ఒరిజినల్ పేరు ప్రపంచానికి తెలిసిందన్న చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు