/rtv/media/media_files/2025/03/07/iwv9MygQTThIt31hY364.jpg)
Nagababu MLC Nomination
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. జనసేన నుంచి కొణిదల నాగబాబు, BJP నుంచి సోము వీర్రాజు, TDP నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవల ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం.
— RTV (@RTVnewsnetwork) March 13, 2025
టీడీపీ నుంచి బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ.
జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఏకగ్రీవ ఎన్నిక.@JaiTDP @JanaSenaParty @BJP4Andhra #AndhraPradesh #mlcelections #candidates #tdp #janasena #RTV pic.twitter.com/QNaJbYnrIq
అన్నీ కూటమికే..
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలా బలాల దృష్ట్యా ఐదు స్థానాలు కూటమికే దక్కే అవకాశం ఏర్పడింది. దీంతో టీడీపీ ముగ్గురు, జనసేన, బీజేపీ పార్టీలు ఒక్కో అభ్యర్థి చొప్పన బరిలోకి దించాయి. ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు వీరికి ధ్రువీకరణ పత్రాలు అందించారు.
తెలంగాణలోనూ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి దాఖలు చేసిన నెల్లికంటి సూర్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు.