వైఎస్ ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయిన కేసీఆర్ పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది నిజం కాదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు శాసనసభలో సీఎం మాట్లాడుతూ.. ఆనాడు వీళ్లు సహకరించకపోతే పోతిరెడ్డి పాడు పొక్క పెద్దదయ్యేదా? అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్ల కోసం కక్కుర్తి పడి జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించాడన్నారు. ఆ నీళ్లను శ్రీశైలంకు పంపించడం వల్ల ప్రాజెక్టును పూర్తి చేసినా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పదేళ్లయినా పూర్తి చేయకుండా నల్లగొండకు అన్యాయం చేసింది నిజం కాదా? అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి, ఎనిమిది మంది చావుకు కారణం మీరు కాదా? అంటూ ప్రశ్నలు గుప్పించారు.
షాకింగ్.. 15 నెలల్లో 57,84, 124 లక్షల జీతం తీసుకున్న కేసీఆర్
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 15, 2025
కానీ, అసెంబ్లీకి వచ్చింది కేవలం 2 రోజులే
-సీఎం రేవంత్ రెడ్డి#Telangana#Hyderabad#BRS#KTR#Congress#RevanthReddy#BJP#HarishRaopic.twitter.com/Zj1oIotE0u
సవాలుకు సిద్ధమా?
కృష్ణా పరివాహక ప్రాంతంలో పదేళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదు? అని ధ్వజమెత్తారు. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ సభ నుంచి వెళ్లిపోయారన్నారు. 15 నెలల్లో కేసీఆర్ సభకు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారన్నారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిన నాయకుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నల్లగొండకు కష్టాలు తీరేది కదా? అని అన్నారు.
కేసీఆర్ సభకు ఏ రోజు వస్తే ఆ రోజే కృష్ణా జలాలపై చర్చ పెడదామన్నారు. ఈ విషయాన్ని లెక్కలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమది తప్పయితే బీఆర్ఎస్ నాయకులకు తాను క్షమాపణ చెపదానికి సిద్ధం అని సవాలు విసిరారు. ఈ సవాలుకు కేసీఆర్ సిద్ధమా? చెప్పాలన్నారు.
రోజుకు 10 టీఎంసీలు తరలించుకుపోయే ప్రాజెక్టులు పక్క రాష్ట్రం నిర్మిస్తుంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్నారు. ఒక సామాన్య రైతు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తే.. విధి లేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యిందన్నారు. ఏపీ వైసీపీ నేత రోజ రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కేసీఆర్.. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును మాత్రం పడావు పెట్టారన్నారు.
కుటుంబ సభ్యుల వల్ల..
— Congress for Telangana (@Congress4TS) March 15, 2025
ఆయనకు ప్రాణ ప్రమాదం ఉంది..
కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నారు
అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు..#RevanthReddy
• @revanth_anumulapic.twitter.com/X0jhUebTz9
కేసీఆర్ కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. అందుకే వారందరికీ ఆయన దూరంగా ఉంటున్నాడన్నారు.