🔴Live Breakings: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్పై పవన్ సంచలన ప్రకటన
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిన్న పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. ఈ హత్య వెనుక కేంద్ర హోంశాఖ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ ది నిజంగా యాక్సిడెంట్ అయితే ఆయన బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా జగన్ నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ముద్రగడ జగన్ కు లేఖ రాశారు. PACలో చోటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు త్రికణశుద్ధిగా పని చేస్తానన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను తొలగించాలని హైకమాండ్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ ఫిర్యాదు చేశారు.
మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీలో పని చేసిన కపిలవాయి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు.
రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బూతులు మాట్లాడే నేతలు ఎక్కువయ్యారంటూ తిరుపతి మేధావుల సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం వికసిత్ భారత్ వైపు నడవాలని, అందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తదితరులు ఈ రోజు సత్యనారాయణ రావును పరామర్శించారు.
టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 3 నెలల్లోనే 100కి పైగా ఆవులు చనిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టేసిందని ఆరోపించారు. తిరుమలలో మహాపచారం జరుగుతోందన్నారు.
చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.