ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు.
నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 22, 2025
అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం...
భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే... మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా... సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం కావాల్సిందే.… pic.twitter.com/GBqbhMYzjQ
తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ తన X ఖాతాలో విజయశాంతి పోస్ట్ పెట్టారు.
అయితే... విజయశాంతి ట్వీట్ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. HCU వివాదం నేపథ్యంలో రేవంత్‌కు విజయశాంతి గట్టి కౌంటర్ ఇచ్చారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్ కూడా HCU భూములపై రియాక్ట్ కాగా.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ కూడా రేవంత్ చర్యలు సరికావని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు మాత్రం... పచ్చకామెర్ల రోగికి అన్నీ పచ్చగా కన్పించినట్లు.. గులాబీ నేతలకు పవరే కాదు... బుర్రలో చిప్ కూడా దొబ్బిందని ఘాటుగా స్పందిస్తున్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా.. ప్రతీ దానికి రేవంత్‌కు ముడిపెట్టడం... కామన్ అయిపోయిందని విమర్శిస్తున్నారు.
(vijayashanthi | telugu-news | telugu breaking news | hcu land )