IND-EU: భారత్-యూరప్ ఒప్పందం.. బీరు నుంచి కార్ల వరకు ఇకపై అన్ని చౌక చౌక

చాలా ఏళ్ల తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనివల్ల రెండు దేశాల మధ్య వ్యాపారం సులభతరం కావడమే కాకుండా వినియోగదారులకు అనేక విదేశీ వస్తువులు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

New Update
IND-EU

IND-EU

చాలా ఏళ్ల తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనివల్ల రెండు దేశాల మధ్య వ్యాపారం సులభతరం కావడమే కాకుండా వినియోగదారులకు అనేక విదేశీ వస్తువులు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒప్పందం ద్వారా దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. అయితే ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

ఇది కూడా చూడండి: Medaram Jatara : మానవజన్మఎత్తి వీరవనితలుగా నిలిచిన అడవిచుక్కలు "సమ్మక్క..సారక్క'

ఇది కూడా చూడండి: ఇండియా-ఈయూ వాణిజ్య ఒప్పందం.. పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

మద్యం

ఈ ఒప్పందంలో భాగంగా యూరప్ నుంచి వచ్చే బీరు, వైన్, ఇతర విస్కీల మీద భారత్ విధిస్తున్న పన్నులను గణనీయంగా తగ్గించనుంది. ప్రస్తుతం యూరప్ మద్యంపై ఉన్న అత్యధిక సుంకాలు దశలవారీగా తగ్గుతాయి. దీనివల్ల విదేశీ బ్రాండ్ల మద్యం ధరలు భారత మార్కెట్‌లో సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

తగ్గనున్న లగ్జరీ కార్ల ధరలు

భారతదేశం విదేశీ కార్లపై, ముఖ్యంగా లగ్జరీ కార్లపై భారీగా పన్నులు విధిస్తుంది. తాజా ఒప్పందం ప్రకారం యూరప్ నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం కార్ల మీద సుంకాలను భారత్ తగ్గిస్తుంది. మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి కంపెనీల కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇక మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే ఇది స్థానిక కార్ల తయారీదారులపై ప్రభావం చూపకుండా కొన్ని నిబంధలన ప్రకారం అమలు చేయనున్నారు.

వైద్య పరికరాలు

కేవలం విలాసవంతమైన వస్తువులే కాకుండా యూరప్ నుంచి వచ్చే అధునాతన వైద్య పరికరాలు, మెషినరీ, రసాయనాలపై కూడా పన్నులు తగ్గుతాయి. దీనివల్ల భారతీయ ఆరోగ్య రంగంలో ఆధునిక చికిత్సలు తక్కువ ధరకు వస్తాయి. వీటితో పాటు యూరప్ నుంచి వచ్చే పాల ఉత్పత్తులు, కొన్ని ఆహార పదార్థాల పైన కూడా సుంకాలు తగ్గే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: Andhra Pradesh: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

దేశానికి ప్రయోజనాలు

ఈ ఒప్పందం వల్ల కేవలం యూరప్ వస్తువులే కాకుండా భారతదేశం నుంచి యూరప్‌కు వెళ్లే దుస్తులు, పాదరక్షలు, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులకు అక్కడ మార్కెట్‌లో పెద్ద పీట వేయనున్నారు. మన దేశ ఎగుమతులు పెరగడం వల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఐటీ రంగ నిపుణులు యూరప్ దేశాలకు వెళ్లి పనిచేయడానికి వీసా నిబంధనలు కూడా కొంత సరళతరం అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వాణిజ్య ఒప్పందం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. 

Advertisment
తాజా కథనాలు