BIG BREAKING: ఏపీ కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. జోగి రమేష్ వాట్సాప్ చాట్ లీక్!

ఏపీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ రావుతో వైసీపీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది.

New Update
Jogi Ramesh Fake Liquor Scam

ఏపీలో కల్తీ మద్యం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే కల్తీ మద్యం తయారు చేసినట్లు ఏ1 జనార్ధన్ రావు చెప్పిన వీడియో నిన్న సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి స్పష్టం చేశారు. భార్యాబిడ్డల సాక్షిగా తాను ఏ తప్పు చేయలేదన్నారు. అవసరం అయితే తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమన్నారు. ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణపై నమ్మకం లేదన్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. ఏ1 జనార్ధన్ రావుతో జోగి రమేష్ వాట్సాప్ చాట్ వెలుగులోకి వచ్చింది. దీంతో కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్రపై చర్చ సాగుతోంది.

ఏపీ లిక్కర్ స్కామ్ లో A1గా ఉన్న  జనార్ధన్ వీడియో నిన్న విడుదలైంది. జోగి రమేష్ చెబితేనే తాను మద్యం కల్తీ చేశానని జనార్ధన్ తెలిపారు. జోగి రమేషే ములకల చెరువును సూచించారని అన్నారు. సర్కార్‌పై బుదరజల్లేందుకు కల్తీ చేయించారని చెప్పుకొచ్చాడు. జోగి రమేష్ ఆఫర్ చేసిన రూ.3 కోట్లకు ఆశపడే కల్తీ చేశానని బాంబు పేల్చాడు. తనను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. 

సిట్ ఏర్పాటు చేసిన సర్కార్..

ఇదిలా ఉంటే ఏపీలో కల్తీ మద్యం వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ సీరియస్ గా ఉంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడ్డ కల్తీ మద్యానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సిట్ లో నలుగురు అధికారులు ఉండనున్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సిట్ కు నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా రాహుల్‌దేవ్‌శర్మ, కె.చక్రవర్తి, మలికా గర్గ్‌ను నియమించింది ఏపీ సర్కార్. విచారణలో భాగంగా ప్రతీ 15 రోజులకు ఒక సారి రిపోర్ట్ ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది ప్రభుత్వం.

Advertisment
తాజా కథనాలు